ఎల్‌జి గ్లోబల్ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేసిన 30 సెకన్ల వీడియోలో డ్యూయల్ స్క్రీన్ తో తిరిగేటట్లు టి-ఆకారపూ డిజైన్ సూచిస్తుంది. అయితే కొత్త మోడల్ గురించి ఎల్‌జి ఎటువంటి వివరాలను అందించలేదు.
విలక్షణమైన, ఇంకా ఎవరు కనిపెట్టని కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్న ఎల్‌జి తన ఎక్స్‌ప్లోరర్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్లు బుధవారం ప్రకటించింది. కొత్త లైనప్ కింద మొదటి మోడల్ సెప్టెంబర్ 14 నాటికి ప్రారంభమవుతుందని టీజర్ వీడియో విడుదల చేయడంతో కంపెనీ తెలిపింది.
ఎల్‌జి గ్లోబల్ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేసిన 30 సెకన్ల వీడియోలో డ్యూయల్ స్క్రీన్ తో తిరిగేటట్లు టి-ఆకారపూ డిజైన్ సూచిస్తుంది. అయితే కొత్త మోడల్ గురించి ఎల్‌జి ఎటువంటి వివరాలను అందించలేదు.
undefined
also read
ఎల్‌జి మొబైల్ గ్లోబల్ ఫేస్‌బుక్, యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా సెప్టెంబర్ 14 న వర్చువల్ గా ఈ డివైస్ ను లాంచ్ చేయనుంది. కొత్త స్మార్ట్‌ఫోన్ తన ఎక్స్‌ప్లోరర్ ప్రాజెక్టులో భాగమని ఎల్‌జి ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
సంస్థ కొత్త ఫారమ్ ఫ్యాక్టర్ కోసం ఫీచర్లను అభివృద్ధి చేయడానికి క్వాల్కమ్, రేవ్, ఫిక్టో, ట్యూబి, మరియు నావర్‌ల భాగస్వాములతో కలిసి పనిచేస్తోంది. ఎల్‌జి వింగ్ ఫోన్ ప్రీమియం ధర $ 1,000 (సుమారు రూ. 73,000) తో ఆవిష్కరించవచ్చు.
ట్రిపుల్ రియర్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 765జి SoC లతో ప్రారంభమైన ఎల్‌జి వెల్వెట్ లాగానే కొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సంస్థ ఉనికిని సరికొత్త మొబైల్ వ్యూ అనుభవాన్ని తీసుకురావడం ద్వారా కొత్త స్థాయికి తీసుకువెళుతుందని అంచనా.
https://www.youtube.com/watch?v=7H7FT0Sands