మళ్లీ పనిచేయని ఫేస్ బుక్.. వినియోగదారులకు క్షమాపణలు..!

By telugu news team  |  First Published Oct 9, 2021, 8:31 AM IST

శుక్రవారం తమ ఫేస్ బుక్ మెసెంజర్ లో మెసేజ్ లు చేయలేకపోయారని.. కొందరు ఇన్ స్టాగ్రామ్ లో ఫీడ్ లు లోడ్ చేయలేకపోయారనే ఫిర్యాదులు అందాయని చెప్పారు. కేవలం ఒకే వారంలో ఇలా రెండు సార్లు జరగడం పట్ల తాము చింతిస్తున్నట్లు చెప్పారు. 
 



ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ మరోసారి తమ యూజర్లకు క్షమాపణలు తెలియజేసింది. ఒకే వారంలో రెండు సార్లు ఫేస్ బుక్ సేవలకు అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో.. ఫేస్ బుక్ తమ యూజర్లకు మరోసారి క్షమాపణలు ెప్పింది. ఇటీవల ఫేస్ బుక్, ఇన్ స్ట్రామ్ లు కొన్ని గంటలపాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కాగా.. ఇలాంటి సంఘటన శుక్రవారం కూడా చోటుచేసుకుంది.

శుక్రవారం సైతం కొంత సేపు ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రమ్ లు పనిచేయలేదు. వాటి సేవలకు అంతరాయం కలిగింది. చాలా మంది వాటిని యాక్సెస్ చేసుకోలేకపోయారు. దీంతో.. ఫేస్ బుక్ ఈ ఘటనకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. శుక్రవారం దాదాపు రెండు గంటలపాటు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సేవలకు అంతరాయం కలిగిందని.. వాటిని యాక్సెస్ చేసుకోలేక ఇబ్బంది పడిన యూజర్లకు క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొనడం గమనార్హం.

Latest Videos

undefined

కొందరు శుక్రవారం తమ ఫేస్ బుక్ మెసెంజర్ లో మెసేజ్ లు చేయలేకపోయారని.. కొందరు ఇన్ స్టాగ్రామ్ లో ఫీడ్ లు లోడ్ చేయలేకపోయారనే ఫిర్యాదులు అందాయని చెప్పారు. కేవలం ఒకే వారంలో ఇలా రెండు సార్లు జరగడం పట్ల తాము చింతిస్తున్నట్లు చెప్పారు. 

ఇదిలా ఉండగా.. ఈ వారం మొదట్లో సోమవారం దాదాపు 7గంటల పాటు ఫేస్ బుక్ పని చేయలేదు.  భారత్‌ సహా పలు దేశాల్లో వీటి సేవలకు అంతరాయం ఏర్పడింది. ఆండ్రాయిడ్‌ తో పాటు ఐవోఎస్‌ వినియోగదారులూ ఇబ్బందులు  ఎదుర్కొన్నారు. సందేశాలు పంపించడానికి వీలు లేక వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు.

ఫేస్ బుక్ లో తాజాగా తలెత్తిన అంతరాయం గంటల వ్యవధిలోనే ఆ సంస్థకు భారీ తెచ్చింది. అంతేకాదు, ఫేస్ బుక్ యజమాని మార్క్ జుగర్ బర్గ్ వ్యక్తిగత ఆదాయాన్నీ కోల్పోయి బిలియనీర్ల జాబితాలో దిగజారిపోయాడు. సుమారు ఏడు గంటలపాటు తలెత్తిన అంతరాయం కారణంగా ఫేస్‌ బుక్‌ సంస్థ భారీ నష్టాన్ని చవిచూసింది. దాదాపు 7 బిలియన్‌ డాలర్ల నష్టం వచ్చినట్లు బ్లూమ్స్ బర్గ్ తదితర సంస్థలు అంచనా వేశాయి. అంతేకాదు, ప్రపంచ వ్యాప్త అంతరాయం కారణంగా సోమవారం ఫేస్ బుక్ షేర్లు పడిపోవడంతో జుకర్‌బర్గ్‌ ర్యాంక్‌ బిల్‌ గేట్స్‌ కంటే దిగువకు పడిపోయింది. బ్లూమ్‌ బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌లో జుకర్ ఐదో స్థానానికి దిగాడు. సూచిక ప్రకారం.. వారాల వ్యవధిలో సుమారు 140 బిలియన్‌ డాలర్లను ఆయన నష్టపోయాడు.

click me!