రెడ్‌మి నోట్ 9కి పోటీగా లెనోవా కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్‌లు.. త్వరలోనే ఇండియాలో లాంచ్..

By Sandra Ashok KumarFirst Published Nov 23, 2020, 11:23 AM IST
Highlights

రెడ్‌మి నోట్ 9 సిరీస్‌కి పోటీగా లెనోవా కొత్త సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. లెనోవా నుండి రాబోయే కొత్త సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి చైనా సోషల్ మీడియాలో టీజర్‌ను విడుదల చేసింది.

స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లెనోవా త్వరలో ఒక కొత్త స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి  ప్రవేశపెట్టనుంది. రెడ్‌మి నోట్ 9 సిరీస్‌కి పోటీగా లెనోవా కొత్త సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

లెనోవా నుండి రాబోయే కొత్త సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి చైనా సోషల్ మీడియాలో టీజర్‌ను విడుదల చేసింది. ఈ వారం చైనాలో లాంచ్ అయిన రెడ్‌మి నోట్ 9 కొత్త మోడల్‌తో పోటీగా లెనోవా కొత్త సిరీస్ ఉంటుందని చెబుతున్నారు.

టీజర్ ప్రకారం, లెనోవా మూడు కొత్త బడ్జెట్ ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేయనుంది, అయితే ఈ ఫోన్ ఫీచర్స్ గురించి లెనోవా ఎటువంటి సమాచారాన్ని వెల్లడించలేదు.

also read 

ఈ కొత్త సిరీస్ లెనోవా మోటో జి9 పవర్ రీ-బ్రాండెడ్ వెర్షన్‌గా విడుదల చేయవచ్చని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.  

ఆన్‌లైన్ లిస్టింగ్ ప్రకారం  ఈ సిరీస్‌లోని ఒక ఫోన్‌ మోటో జి9 పవర్ వేరియంట్ ఇటీవల చైనా వెబ్‌సైట్‌లో మోడల్ నంబర్ ఎక్స్‌టి 2091-7తో గుర్తించింది. 6.78-అంగుళాల డిస్ ప్లేతో,  5,640 ఎంఏహెచ్ బ్యాటరీతో రావచ్చని  ఊహించవచ్చు.

అయితే మోటో జి9 పవర్ 6.8-అంగుళాల డిస్‌ప్లేతో, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది రెండు ఫోన్‌ల మధ్య కొన్ని ఫీచర్స్ తేడాలను కూడా సూచిస్తుంది.
 

click me!