43 అంగుళాల కోడాక్ టెలివిజన్ 23,999 రూపాయలకు లభిస్తుంది. ఇది భారతదేశంలో 'అధికారిక' ఆండ్రాయిడ్ 4 కె టీవీకి అతి తక్కువ ధర.
భారతదేశంలో కోడాక్ బ్రాండ్ లైసెన్సు కలిగిన సూపర్ ప్లాస్ట్రోనిక్స్ (ఎస్పీపిఎల్) కోడాక్ ఆండ్రాయిడ్ టెలివిజన్లను ఫ్లిప్‌కార్ట్‌లో విడుదల చేసింది.
43 అంగుళాల టెలివిజన్ ధర రూ.23,999కే అందిస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో అఫిషియల్ ఆండ్రాయిడ్ 4కె టీవీలలో అతి తక్కువ ధర ఇది . గూగుల్ సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ టీవీలకు మాత్రమే 'అఫిషియల్' ట్యాగ్ లభిస్తుంది.
undefined
కొడాక్ ఈ సిరీస్ లో 43 అంగుళాలు, 50 అంగుళాలు, 55 అంగుళాలు, 65 అంగుళాల నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఈ సిరీస్ లలో 43 అంగుళాల వేరియంట్‌కు ధర 23,999 రూపాయలు, 65 అంగుళాల వేరియంట్‌కు రూ .49,999. మార్చి 19 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తాయి.
also read ఎంతోగానో ఎదురు చూస్తున్న మోటోరేజర్ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది...ధరెంతంటే.?
ప్రస్తుతం, భారతదేశంలో అధికారిక ఆండ్రాయిడ్ 4కె టీవీల ధరలు రూ .26 వేల నుంచి ప్రారంభమవుతాయి. 55 అంగుళాల టివి విషయానికి వస్తే, సోనీ బ్రాండ్ రూ.85,999 ఖర్చవుతుంది.
సూపర్ ప్లాస్ట్రోనిక్స్ డైరెక్టర్, సిఇఒ అవనీత్ సింగ్ మార్వా మాట్లాడుతూ 2016లో భారత మార్కెట్లోకి ప్రవేశించినప్పటి నుండి భారతదేశంలో కోడాక్ టివి బ్రాండ్‌కు ఇది అతిపెద్ద లాంచ్ అని అన్నారు.
అయితే 2016లో కంపెనీ భారతీయ మార్కెట్లోకి ప్రవేశించినప్పుడు గూగుల్ అఫిషియల్ ట్యాగ్ లేని టీవీలను అందించింది.
"ఇది భారతదేశంలో తయారు చేసిన మొట్టమొదటి బెజెల్ లెస్ టెలివిజన్ వీటిని నోయిడా ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేస్తున్నారు. కోడాక్ అఫిషియల్ ఆండ్రాయిడ్ టీవీ ఫ్రేమ్‌లెస్, డాల్బీ విజన్, 4 కె హెచ్‌డిఆర్ 10, ఆండ్రాయిడ్ 9.0 ఇంటర్‌ఫేస్ ఫీచర్స్ ఉన్నాయి.
బెజెల్ అనేది టీవీ స్క్రీన్ చుట్టూ ఉండే ఒక ఫ్రేమ్ లాంటిది. ఆన్‌లైన్ టెలివిజన్ లలో కోడాక్ పెద్దది అలాగే ఇతర ఆన్‌లైన్ టెలివిజన్ కంటే మెరుగైన బ్రాండ్ రీకాల్ దీనికి ఉందని మార్వా పేర్కొన్నారు.
ఆన్‌లైన్‌లో టివిలను అమ్మే బ్రాండ్లలో కొన్ని కెవిన్, క్లౌడ్‌వాకర్, థామ్సన్ ఐఫాల్కాన్, మైక్రోమాక్స్ ఉన్నాయి. భారతదేశంలో కొడాక్ బ్రాండ్ గతంలో కెమెరాల వంటి ఉత్పత్తులతో సంబంధం ఉన్నందున, దాని బ్రాండ్ రీకాల్ ఇతర ఆన్‌లైన్ టీవీ కంపెనీల కంటే ఎక్కువగా ఉందని మార్వా వివరించారు.
2019 లో, కోడాక్ టీవీలు ఆన్‌లైన్ మార్కెట్ వాటాను 4 శాతం కలిగి ఉన్నాయి మరియు 2020 లో 4.5-5 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి.
కోడాక్ ఆండ్రాయిడ్ 4కె టివిలలో డాల్బీ డిజిటల్ ప్లస్ విత్ డిటిఎస్ ట్రూసారౌండ్, యూఎస్‌బి 3.0 తో మల్టీ కనెక్టివిటీ ఆప్షన్స్, హెచ్‌డిఎంఐ ఏఆర్‌సి / సిఇసి, యూజర్ ఫ్రెండ్లీ రిమోట్‌తో బ్లూటూత్ వి 5.0 (తాజా వెర్షన్) ఉన్నాయి.
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్, గూగుల్ ప్లే స్టోర్ కోసం రిమోట్ హాట్‌కీలు ఉన్నాయి. స్ముత్ నావిగేషన్ కోసం గూగుల్ అసిస్టెంట్ కూడ ఉంది.
also read ఆన్ లిమిటెడ్ కాల్స్, హై స్పీడ్ డాటాతో వొడాఫోన్ ఐడియా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్...
అక్యుమెన్ రీసెర్చ్ అండ్ కన్సల్టింగ్ ప్రకారం, ప్రపంచ ఆండ్రాయిడ్ టివి మార్కెట్ సైజ్ 2026 నాటికి సుమారు 231 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, 2019-2026 అంచనా కాలంలో 20 శాతం సిఎజిఆర్ ఉంటుంది.
ఎస్‌పిపీఎల్ ఏడాది మొత్తంలో కొత్త టీవీ మోడళ్లను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2020 లో ఎస్‌పిపిఎల్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి 700 కోట్ల రూపాయల టర్నోవర్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. అధికారిక ఆండ్రాయిడ్ టెలివిజన్లను ప్రారంభించడంతో, 2019 లో 60 శాతం వృద్ధితో పోలిస్తే 2020 లో వాల్యూమ్ సేల్స్ 100 శాతం వృద్ధిని సాధించాలని ఎస్‌పిపిఎల్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఫ్లిప్‌కార్ట్, సీనియర్ డైరెక్టర్ హరి కుమార్ మాట్లాడుతూ డెబిట్ కార్డ్ ఇఎంఐ, బై నౌ పే లేటర్ వంటి పేమెంట్ ద్వారా, ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం కోడాక్ బ్రాండ్‌ను దేశంలోని నలుమూలలకు తీసుకెళ్లడానికి సహాయపడుతుంది.