జియోఫోన్ వాడేవారికి గుడ్ న్యూస్.. ఆన్ లైన్ పేమెంట్ల కోసం కొత్త ఫీచర్..

By Sandra Ashok KumarFirst Published Aug 19, 2020, 5:44 PM IST
Highlights

ఎంపిక చేసిన వినియోగదారులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ కొత్త ఫీచర్ ఒక సంవత్సరానికి పైగా ఇంటర్నల్ టెస్టులో ఉన్నట్లు తెలిసింది. జియో ఫోన్ వినియోగదారులకు దాని రోల్ అవుట్ ఆగస్టు 15 న ప్రారంభమైనట్లు తెలిసింది. 

జియో ఫోన్ వినియోగదారులు జియో పేతో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపిఐ) సపోర్ట్ పొందడం ప్రారంభించినట్లు ఒక నివేదిక తెలిపింది. ఎంపిక చేసిన వినియోగదారులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ కొత్త ఫీచర్ ఒక సంవత్సరానికి పైగా ఇంటర్నల్ టెస్టులో ఉన్నట్లు తెలిసింది.

జియో ఫోన్ వినియోగదారులకు దాని రోల్ అవుట్ ఆగస్టు 15 న ప్రారంభమైనట్లు తెలిసింది. కొన్ని నివేదికల ప్రకారం జియో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) తో కలిసి జియో ఫోన్‌లో  పేమెంట్ ఫీచర్ ప్రారంభించడానికి పనిచేస్తున్నాయని సూచించాయి.

జియో ఫోన్ కోసం జియో పే  రోల్ అవుట్ యుపిఐ ఆధారిత పేమెంట్ అనుభవాన్ని కేవలం వెయ్యి మంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది అని ఒక నివేదిక నివేదించింది. అధికారిక వెబ్‌సైట్ జియో ఫోన్‌లో జియో పేని సూచిస్తూ మూడు ఫోటోలను షేర్ చేసింది.

also read 

ఈ ఫీచర్ ట్యాప్ & పే, మనీ ట్రాన్స్ఫర్, రీఛార్జ్, అక్కౌంట్ ఫీచర్స్ అందిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది పేమెంట్ హిస్టరీని చూడడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. మనీ ట్రాన్స్ఫర్ కోసం జియో ఫోన్‌లోని జియో పే యాప్ యుపిఐని ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది.

ట్యాప్ & పే ఫీచర్‌ను ప్రారంభించడానికి ఫోన్  ఇంటర్నల్ ఎన్‌ఎఫ్‌సిని ఉపయోగించుకునే అవకాశం ఉంది. కైయోస్‌లో నడుస్తున్న జియో ఫోన్‌కు జియో పే తీసుకురావడానికి యుపిఐ పేమెంట్ లావాదేవీల వ్యవస్థను జియో పునర్నిర్మించినట్లు తెలిసింది.

అలాగే టెలికాం ఆపరేటర్‌ పేమెంట్ల కోసం  యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ఇండ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆర్‌బిఎల్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యెస్ బ్యాంక్ ఉన్నాయి.

click me!