గూగుల్ బుధవారం కార్మో జాబ్స్ యాప్‌ను భారత్‌కు విస్తరించింది. కోర్మో జాబ్స్ మొదట 2018లో బంగ్లాదేశ్‌లో ప్రారంభించింది, తరువాత 2019లో ఇండోనేషియాకు విస్తరించింది. కార్మో జాబ్స్ యాప్ ఉద్యోగాలను కనుగొనడంలో సహాయపడుతుంది.
నీరుద్యోగులకు ఉద్యోగ సంబంధిత అవకాశాలను కనుగొనడంలో సహాయపడటానికి గూగుల్ భారతదేశంలో కార్మో పేరుతో ఒక జాబ్స్ యాప్‌ను ప్రారంభించింది. గూగుల్ బుధవారం కార్మో జాబ్స్ యాప్‌ను భారత్‌కు విస్తరించింది.
కోర్మో జాబ్స్ మొదట 2018లో బంగ్లాదేశ్‌లో ప్రారంభించింది, తరువాత 2019లో ఇండోనేషియాకు విస్తరించింది. కార్మో జాబ్స్ యాప్ ఉద్యోగాలను కనుగొనడంలో సహాయపడుతుంది. నిరుద్యోగులు డిజిటల్ బయోడేటా (సివి) ను సృష్టించడానికి కూడా అనుమతిస్తుంది.
undefined
మైక్రోసాఫ్ట్ లింక్డ్ఇన్ తో పాటు నౌక్రీ.కం, టైమ్స్ జాబ్స్ వంటి భారతీయ సంతతికి చెందిన జాబ్ సెర్చ్ పోర్టల్ కు పోటీగా లక్షలాది మంది ఉద్యోగాలను వెతికే వారికోసం యజమానులతో కనెక్ట్ చేయడానికి గూగుల్ చేసిన కొత్త ప్రయత్నం ఇది.
కార్మో జాబ్స్ మీ ప్రొఫైల్ ఆధారంగా ఉద్యోగాలను కనుగొనటానికి, దరఖాస్తు చేసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీ కెరీర్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి, మీ ప్రొఫైల్ కు కొత్త స్కిల్స్ జోడించడానికి కూడా ఉపయోగపడుతుంది.
also read
గత సంవత్సరం, గూగుల్ పేలో జాబ్స్ స్పాట్ విభాగం ద్వారా కార్మో జాబ్స్ యాప్ ప్రారంభ అనుభవాన్ని భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. గూగుల్ పే ఇంటిగ్రేషన్ ద్వారా డన్జో, జోమాటోతో సహా 20 లక్షలకు పైగా వేరిఫైడ్ ఉద్యోగాలను పోస్ట్ చేయగలిగారు అని కంపెనీ పేర్కొంది.
అయితే దాని ద్వారా ఎంత మంది ఉపాధి పొందగలిగారు అనే వివరాలు లేవు. ఇప్పుడు గూగుల్ పేలోని జాబ్స్ స్పాట్‌ను కార్మో జాబ్స్‌కు రీబ్రాండ్ చేస్తోంది. గూగుల్ పేలో జాబ్స్ స్పాట్ ప్రత్యేకంగా ఎంట్రీ లెవల్ కోసం రూపొందించింది.
కార్మో జాబ్స్‌తో గూగుల్ ఎంట్రీ లెవల్ కు మించి లింక్డ్‌ఇన్‌తో పాటు నౌక్రీ, షైన్.కామ్, టైమ్స్ జాబ్స్‌తో సహా ఇండియా జాబ్ పోర్టల్‌లతో పోటీ పడవచ్చు. ఏప్రిల్ 2018 లో గూగుల్ ఆసాన్‌జాబ్స్, ఫ్రెషర్‌వర్ల్డ్, హెడ్‌హోన్‌చోస్, ఐబిఎం టాలెంట్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్, లింక్డ్ఇన్, క్యూజ్క్స్, షైన్ వంటి జాబ్ పోర్టల్‌లతో భాగస్వామ్యం కలిగి ఉంది. గూగుల్ ఫర్ జాబ్స్ ఫీచర్ 2017 లో యుఎస్‌లో ప్రారంభించింది.