టెలికాం దిగ్గజ సంస్థ జియో దాని కస్టమర్లకు ఇప్పుడు మళ్లీ ఉచితంగా ఇంటర్నెట్ డేటాను అందిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల జియో తాజాగా తన వర్క్ ఫ్రం హోం ప్యాక్ ల వ్యాలిడిటీని కూడా సవరించింది. ఇంతకుముందు దీని వ్యాలిడిటీ మీ ప్రస్తుత ప్లాన్ వ్యాలిడిటీగానే ఉండేది. ఇప్పుడు వ్యాలిడిటీని 30 రోజులకు మార్చింది.
దేశంలోని టెలికాం దిగ్గజలలో ఒకటైన జియో దాని కస్టమర్లకు ఎప్పటిలాగే మళ్లీ ఉచితంగా ఇంటర్నెట్ డేటాను అందిస్తోంది. మీరు జియో కస్టమర్లు అయితే మీకు ఒక సప్రైజ్. ఎందుకంటే జియో మళ్లీ తన వినియోగదారులకు ఉచితంగా డేటాను అందించెందుకు సిద్దమైంది.
అయితే ఈ ఫ్రీ డేటా అందరికీ కాదు కేవలం సెలెక్ట్ చేసిన కస్టమర్లకు మాత్రమే అని తెలిపింది. ఈ ఫ్రీ ఇంటర్నెట్ డేటా ద్వారా రోజుకు 2 జీబీ హై స్పీడ్ డేటాను ఐదు రోజుల పాటు పొందుతారు. ఇదే ఆఫర్ ను జియో ఏప్రిల్ లో కూడా అందించింది.
కరోనా వైరస్ వ్యాప్తి వల్ల జియో తాజాగా తన వర్క్ ఫ్రం హోం ప్యాక్ ల వ్యాలిడిటీని కూడా సవరించింది. ఇంతకుముందు దీని వ్యాలిడిటీ మీ ప్రస్తుత ప్లాన్ వ్యాలిడిటీగానే ఉండేది. ఇప్పుడు వ్యాలిడిటీని 30 రోజులకు మార్చింది.
also read చైనా యాప్స్‌కు చెక్ పెట్టేందుకు ఈ ఒక్క యాప్ చాలు...
అయితే కొంతమంది కస్టమర్లు వారి జియో అకౌంట్లలోకి 2 జీబీ రోజువారీ డేటా యాడ్ ఆన్ ప్యాక్ గా అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా పోస్ట్ చేశారు. దీంతో వినియోగదారులకు మొత్తంగా 10 జీబీ డేటా ఉచితంగా లభించనుంది. అయితే ఈ ఆఫర్ కొంతమంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.
మీ ప్రస్తుత ప్లాన్ ద్వారా లభించే డేటాకు అదనంగా మరో 2జిబి డేటా లభిస్తుందని గుర్తుంచుకోవాలి. సాధారణంగా మీ ప్లాన్ ప్రకారం మీకు రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది అయితే ఈ ఆఫర్ ద్వారా మొత్తం రోజుకి 3.5 జీబీ పొందుతారు. ఈ ఆఫర్ మీకు ఉందో లేదో తెలుసుకోవాలంటే మీరు మై జియో యాప్ లో చెక్ చేసుకోవచ్చు. జియో డేటా ప్యాక్ అనే దాని కింద మీకు ఈ డేటా వివరాలు కనిపిస్తాయి.
జియో ఉచితంగా డేటా అందించడం ఇదే మొదటిసారి కాదు. జియో సెలబ్రేషన్ ప్యాక్ పేరిట 2018లో కూడా ఈ తరహా లాభాలనే జియో అందించింది. ఆ తర్వాత కూడా కొన్ని సార్లు వినియోగదారులకు జియో ఉచిత డేటాను అందించింది.
కరోనావైరస్ కారణంగా ప్రజలు బయటకు వెళ్లి రీచార్జ్ చేసుకోవడం కష్టం అవుతుంది కాబట్టి జియో పీవోఎస్ లైట్ యాప్ ను కూడా జియో అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా ప్రతి రీచార్జ్ పై కమీషన్ కూడా లభించనుంది.