సరికొత్త రిలయన్స్ ‘జియోపేజెస్‌’ మొబైల్‌ బ్రౌజర్‌.. 8 భారతీయ భాషల్లో అందుబాటులోకి...

By Sandra Ashok Kumar  |  First Published Oct 22, 2020, 11:26 AM IST

జియోపేజెస్ శక్తివంతమైన క్రోమియం బ్లింక్ ఇంజన్‌పై నిర్మించబడింది. "ఇది వేగవంతమైన ఇంజన్ మైగ్రేషన్, వెబ్‌పేజీ రెండరింగ్, వేగవంతమైన పేజీ లోడ్, సమర్థవంతమైన మీడియా స్ట్రీమింగ్, ఎమోజి డొమైన్ సపోర్ట్, మెరుగైన బ్రౌజింగ్ అనుభవాన్ని అందిస్తుంది" అని జియో ఒక ప్రకటనలో తెలిపింది.


డిజిటల్ ప్రోత్సాహంతో రిలయన్స్ జియో మేడ్-ఇన్-ఇండియా బ్రౌజర్‌ జియోపేజెస్ ప్రకటించింది, అయితే మరింత మెరుగైన బ్రౌజింగ్‌ అనుభూతిని ఇవ్వడంతో పాటు డేటా గోప్యతకు పెద్ద పీట వేస్తూ దీన్ని రూపొందించినట్లు వివరించింది. జియోపేజెస్ శక్తివంతమైన క్రోమియం బ్లింక్ ఇంజన్‌పై నిర్మించబడింది.

"ఇది వేగవంతమైన ఇంజన్ మైగ్రేషన్, వెబ్‌పేజీ రెండరింగ్, వేగవంతమైన పేజీ లోడ్, సమర్థవంతమైన మీడియా స్ట్రీమింగ్, ఎమోజి డొమైన్ సపోర్ట్, మెరుగైన బ్రౌజింగ్ అనుభవాన్ని అందిస్తుంది" అని జియో ఒక ప్రకటనలో తెలిపింది.

Latest Videos

undefined

పాత వెర్షన్‌కు 1.4 కోట్ల డౌన్‌లోడ్స్‌ ఉన్నాయని, వీటన్నింటినీ దశలవారీగా లేటెస్ట్‌ వెర్షన్‌కి అప్‌గ్రేడ్‌ చేయనున్నామని పేర్కొన్నారు. గూగుల్, బింగ్, ఎంఎస్‌ఎన్, యాహూ వంటి సెర్చి ఇంజిన్లను డిఫాల్ట్‌ సెర్చి ఇంజిన్లుగా పెట్టుకునేలా హోమ్‌ స్క్రీన్‌ కూడా పర్సనలైజ్‌ చేసుకోవచ్చు.

జియో పేజెస్ బ్రౌజర్ హిందీ, మరాఠీ, తమిళం, గుజరాతీ, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీ అనే ఎనిమిది భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తుంది.

also read అమెజాన్ ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్.. వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ డెడ్‌లైన్‌ పొడిగింపు.. ...

జియోపేజెస్ బ్రౌజర్  ఫీచర్స్ :

1. పర్సనలైజేడ్ హోమ్ స్క్రీన్: గూగుల్, బింగ్, ఎంఎస్ఎన్, యాహూ లేదా డక్ డక్ గో వంటి మార్కెట్‌లోని ప్రముఖ సెర్చ్ ఇంజన్లలో దేనినైనా తమ డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా సెట్ చేసే అవకాశం వినియోగదారులకు ఉంది. వారు త్వరగా, సులభంగా యాక్సెస్ చేయడానికోసం హోమ్ స్క్రీన్‌లో ఫేవరెట్ వెబ్‌సైట్ల లింక్‌లను పిన్ చేయవచ్చు.

2. పర్సనలైజేడ్ థీమ్: బ్రౌజింగ్ అనుభవాన్ని మీ అభిరుచికి తగ్గట్టు వివిధ రంగుల బ్యాక్ గ్రౌండ్ థీమ్‌లను వినియోగదారులు సెలెక్ట్ చేసుకోవచ్చు. రాత్రిపూట కంటి చూపు రక్షణ కోసం ‘డార్క్ మోడ్’కి మారవచ్చు.

3. పర్సనలైజేడ్ కంటెంట్: భాష, ఏదైనా అంశం లేదా ప్రాంతం పరంగా వినియోగదారు ప్రాధాన్యతకు అనుగుణంగా కంటెంట్ ఫీడ్ కస్టమైజ్ చేస్తుంది. దీనికి తోడు, వినియోగదారుకు ముఖ్యమైనవి లేదా ఆసక్తి ఉన్న అంశాలపై మాత్రమే జియో పేజెస్ నోటిఫికేషన్‌లను చూపిస్తుంది.

4. ఇన్ఫర్మేటివ్ కార్డ్స్: ఇన్ఫర్మేటివ్ కార్డ్ కి నంబర్స్, ట్రెండ్స్, సింబల్స్ లేదా హెడ్ లైన్స్ క్యాప్చర్ చేస్తుంది, ఉదాహరణకు స్టాక్ మార్కెట్ ట్రెండ్స్, వస్తువుల ధరలు లేదా క్రికెట్ స్కోరు వంటి వాటిని స్క్రీన్ పై కాంపాక్ట్ క్లిక్ చేయగల బ్యానర్‌లు ప్రదర్శిస్తుంది.

5. రీజనల్ కంటెంట్:  బ్రౌజర్ ఎనిమిది భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తుంది: హిందీ, మరాఠీ, తమిళం, గుజరాతీ, తెలుగు, మలయాళం, కన్నడ మరియు బెంగాలీ. వినియోగదారులు ఇష్టపడే విధంగా కంటెంట్ ఫీడ్‌ను పర్సనలైజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకున్నా తర్వాత, రాష్ట్రంలోని పాపులర్ సైట్లు స్క్రీన్ పై కనిపించడం ప్రారంభిస్తాయి.

6. అడ్వాన్స్డ్ డౌన్‌లోడ్ మేనేజర్: జియో పేజెస్ బ్రౌజర్ డౌన్‌లోడ్‌లను అంటే ఫోటోస్, వీడియోలు, డాకుమెంట్ లేదా పేజీలు ఆటోమేటిక్ గా క్యాటగిరి చేస్తుంది. ఇది వినియోగదారుకు ఫిలెస్ నిర్వహణను సులభతరం చేస్తుంది.

7. ఇంకోజ్ఞిట్ మోడ్:  ఇంకాగ్నిట్ మోడ్ బ్రౌజింగ్ హిస్టరీ సిస్టమ్‌లో స్టోర్ చేయకుండా నిరోధించడం ద్వారా ప్రైవేట్ బ్రౌజింగ్‌ను అనుమతిస్తుంది. జియో పేజెస్ లో, వినియోగదారులు ఇంకాగ్నిట్ మోడ్‌కు అక్సెస్ కోడ్‌గా నాలుగు-అంకెల సెక్యూరిటి పిన్ లేదా ఫింగర్ ప్రింట్  సెట్ చేసే అవకాశం ఉంది.

8. యాడ్ బ్లాకర్: వినియోగదారుకు ఆటంకం లేని బ్రౌజింగ్ అనుభవాన్ని అందించడానికి బ్రౌజర్ యాడ్స్, పాపప్‌లను బ్లాక్ చేస్తుంది.

మీ మొబైల్‌లో జియోపేజెస్ బ్రౌజర్‌ను డౌన్‌లోడ్ చేయడం ఎలా:

ప్రస్తుతం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో మాత్రమే  జియోపేజెస్ బ్రౌజర్‌ అందుబాటులో ఉంది, గూగుల్ ప్లేస్టోర్ నుండి జియోపేజెస్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.అంతేకాకుండా, భారతదేశంలో 5జి కనెక్షన్‌ను పెంచడానికి జియో, క్వాల్కమ్ టెక్నాలజీస్ ఇంక్., పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ రాడిసిస్ కార్పొరేషన్‌తో కలిసి 5జి నెట్‌వర్క్ పరిష్కారాల కోసం ప్రయత్నాలను మంగళవారం ప్రకటించాయి. ఈ పని భారతదేశంలో స్వదేశీ 5జి నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలు, సేవల అభివృద్ధిని వేగంగా గుర్తించడానికి ఉద్దేశించబడింది.

 

మరిన్ని అప్ డేట్స్ కోసం ఫాలో అవ్వండి 
https://twitter.com/JioBrowser

https://www.facebook.com/browserjio

click me!