రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్....ఎక్కువ రోజుల వాలిడిటీతో....

By Sandra Ashok Kumar  |  First Published Mar 8, 2020, 4:19 PM IST

ఈ వార్షిక ప్లాన్స్ వల్ల ప్రతి నెల ఫోన్ నంబర్‌ను రీఛార్జ్ చేసే భారాన్ని తగ్గిస్తుంది. అన్ని ప్రధాన టెలికం ఆపరేటర్లు తమ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం వార్షిక ప్రణాళికలను అందిస్తున్నారు.


రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది. అదేంటంటే రిలయన్స్ జియో రూ .4,999 వార్షిక ప్లాన్ ను తిరిగి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ గత సంవత్సరంలో నిలిపివేశారు. జియో నుండి ఇప్పుడు కొత్త వార్షిక ప్లాన్ అందిస్తుంది.

ఈ వార్షిక ప్లాన్స్ వల్ల ప్రతి నెల ఫోన్ నంబర్‌ను రీఛార్జ్ చేసే భారాన్ని తగ్గిస్తుంది. అన్ని ప్రధాన టెలికం ఆపరేటర్లు తమ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం వార్షిక ప్రణాళికలను అందిస్తున్నారు.

Latest Videos

undefined

also read మీ డెబిట్/క్రెడిట్ కార్డులు 16లోపు వాడండి లేదంటే...

కొత్త రూ.4999 దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా ఆన్ లిమిటెడ్ జియో-జియో కాల్స్ అందిస్తుంది. కాని ఇతర ఆపరేటర్లకు కాల్స్ చేసుకోవడానికి 12,000 నిమిషాల టాక్ టైమ్ పొందుతారు. 12000 నిమిషాల టాక్ టైమ్ ముగిసిన తర్వాత వినియోగదారులు కాల్స్ కోసం తిరిగి రిచార్జ్ చేసుకోవాల్సి  ఉంటుంది.

కొత్త రూ. 4999 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా జియో యూజర్లు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 350 జిబి 4జి డేటా పొందుతారు. అయితే, మొత్తం 350 జిబి డేటా వినియోగించిన తరువాత డాటా స్పీడ్ 64 కెబిపిఎస్ కు పడిపోతుంది.

జియో రూ. 4999 ప్లాన్ 360 రోజుల వాలిడిటీ అందిస్తుంది. ఇది జియో రిచార్జ్ ప్లాన్ లలో ఎక్కువ రోజుల వాలిడిటీ కలిగిన ప్లాన్లలో ఒకటి. ఇతర వార్షిక ప్రణాళికలు 336 రోజుల వాలిడిటీతో వస్తాయి. జియో ఇటీవల ఈ ప్లాన్ వాలిడిటీని 365 రోజుల నుండి 336 రోజులకు తగ్గించింది.

రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారులకు అనేక ఇతర వార్షిక ప్లాన్లను కూడా అందిస్తుంది.  జియో గత ఏడాది రూ.2121 ప్లాన్‌ను ప్రారంభించింది. నూతన సంవత్సర ఆఫర్‌లో భాగంగా రిచార్జ్ ప్లాన్ ధరను 2020 రూపాయలకు తగ్గించారు.

అయితే కొంతకాలం వరకు మాత్రమే పరిమిత కాల ఆఫర్ కింద ఈ ప్లాన్ ధరను తగ్గించింది.  తరువాత తిరిగి ప్లాన్ ధర మళ్లీ 2121 రూపాయలకు మార్చేసింది.

ఈ ప్లాన్ ద్వారా జియో తమ కస్టమర్లకు ఆన్ లిమిటెడ్ ఆఫ్-నెట్ కాల్స్ అందిస్తుంది. అయితే జియో నుండి ఇతర ఫోన్ నంబర్లకు కాల్స్ చేయడానికి 12000 నిమిషాల టాక్ టైమ్ ఇస్తుంది. 

also read మార్చి 19న నోకియా 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్...

ఈ ప్లాన్ ప్రతి రోజూ 1.5జి‌బి 4జి‌ డేటాను అందిస్తుంది. మొత్తం 504జి‌బి డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు ఇంకా అన్ని జియో యాప్స్ లకు ఆక్సెస్ కూడా పొందుతారు. ఈ ప్లాన్ 336 రోజుల వాలిడిటీ ఇస్తుంది.

ఇంటర్నెట్‌ను ఎక్కువగా ఉపయోగించని వారి కోసం రూ .1299 ప్రీపెయిడ్ ప్లాన్ నీ ఆఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ కింద జియో వినియోగదారులకు ఆన్ లిమిటెడ్ ఆఫ్-నెట్ కాల్స్ , జియో నుంచి ఇతర నెట్వర్క్ లకు కాల్స్  కోసం 12000 నిమిషాల టాక్ టైమ్ అందిస్తుంది.

ఆ తరువాత ఇతర నెట్‌వర్క్‌లకు కాల్స్ చేయడానికి వినియోగదారులు అదనపు రిచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రీపెయిడ్ ప్లాన్ మొత్తం 24 జిబి డేటా, 3600 ఎస్ఎంఎస్ లు ఇంకా అన్ని జియో యాప్స్ లకు యాక్సెస్ అందిస్తుంది. ఈ ప్లాన్ 336 రోజుల వాలిడిటీ ఉంటుంది.
 

click me!