చైనాకు భారత్ మరో షాక్.. పబ్‌జితో సహ మరో 47 యాప్స్ పై నిషేధం

By Sandra Ashok KumarFirst Published Jul 27, 2020, 12:22 PM IST
Highlights

టెలికాం మంత్రిత్వ శాఖ భద్రతా సమీక్ష తర్వాత 47 చైనా యాప్‌లను నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు. జాతీయ భద్రత, వినియోగదారు గోప్యతను ఉల్లంఘించినందుకు మొత్తం 275 యాప్‌లను ప్రభుత్వం నిషేదించనుంది. 

టిక్‌టాక్, వీచాట్‌తో సహా గత నెలలో 59 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన తరువాత తాజాగా మరో 47 యాప్స్ ని ప్రభుత్వం నిషేధించింది. టెలికాం మంత్రిత్వ శాఖ భద్రతా సమీక్ష తర్వాత 47 చైనా యాప్‌లను నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు.

జాతీయ భద్రత, వినియోగదారు గోప్యతను ఉల్లంఘించినందుకు మొత్తం 275 యాప్‌లను ప్రభుత్వం నిషేదించనుంది. త్వరలో ప్రభుత్వం నిషేధించే 275 యాప్‌ల జాబితాలో పబ్‌జితో సహా మరి కొన్ని యాప్‌లు ఉన్నాయి.

also read 

వివిధ మీడియా నివేదికల ప్రకారం నిషేధించిన 47 చైనీస్ యాప్స్ గతంలో నిషేధించైనా 59 యాప్స్ తో క్లోన్‌లుగా పనిచేస్తున్నాయి. అయితే నిషేదించిన 47 చైనా యాప్స్ వివరాలు  త్వరలో విడుదల కానుంది.

నిషేధాన్ని ప్రకటించిన ప్రభుత్వ పత్రికా ప్రకటనలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69ఎ కింద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (పబ్లిక్ అండ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ని అడ్డుకోవటానికి ప్రొసీజర్ అండ్ సేఫ్ గార్డ్స్) నిబంధనలతో ఈ యాప్స్ నిషేదించింది. 

 

కొత్తగా 47 చైనీస్ యాప్ లను బ్యాన్ చేసిన భారత్. pic.twitter.com/YgV4kgDhNj

— Asianetnews Telugu (@asianet_telugu)
click me!