కొనేముందు స్కాన్ చేస్తే అదిరిపోయే ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌తో డిస్కౌంట్లు కూడా?

By Sandra Ashok KumarFirst Published Jul 25, 2020, 1:57 PM IST
Highlights

క్యూఆర్ కోడ్ అనేది రెండు-డైమెన్షనల్ మెషీన్-రీడబుల్ బార్‌కోడ్‌లు, వీటిని ఎక్కువగా ఏదైనా వస్తువు కొనే వద్ద మొబైల్ ద్వారా పేమెంట్ లను సులభతరం చేయడానికి ఉపయోగిస్తారు. క్యూఆర్ కోడులు పెద్ద మొత్తంలో సమాచారాన్ని స్టోర్ చేయగలవు.
 

ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో, వినియోగదారులలో క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ లావాదేవీల వాడకాన్ని మరింత పాపులర్  చేయడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బి‌ఐ) నివేదిక బుధవారం తెలిపింది.

క్యూఆర్ కోడ్ అనేది రెండు-డైమెన్షనల్ మెషీన్-రీడబుల్ బార్‌కోడ్‌లు, వీటిని ఎక్కువగా ఏదైనా వస్తువు కొనే వద్ద మొబైల్ ద్వారా పేమెంట్ లను సులభతరం చేయడానికి ఉపయోగిస్తారు. క్యూఆర్ కోడులు పెద్ద మొత్తంలో సమాచారాన్ని స్టోర్ చేయగలవు.

1990లలో డెన్సో వేవ్ అనే జపనీస్ సంస్థ క్యూఆర్ కోడ్‌ను కనుగొంది. భారతదేశంలో క్యూఆర్ కోడ్ పేమెంట్ వ్యవస్థలు మూడు వేర్వేరు రకాల క్యూఆర్ కోడ్ పేమెంట్ లకు విస్తృతంగా మద్దతు ఇస్తున్నాయి.

అందులోనివి  భారత్ క్యూఆర్, యుపిఐ క్యూఆర్, ప్రొప్రైటరీ క్యూఆర్. "క్యూఆర్ కోడ్ / యుపిఐ / రుపే డెబిట్ కార్డ్ లావాదేవీలపై సున్నా ఎండిఆర్ బదులుగా కంట్రోలెడ్ ఇంటర్‌చేంజ్‌ను ప్రభుత్వం / ఆర్‌బిఐ అనుమతించాలి, అలాగే ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా పేమెంట్లను అంగీకరించే వ్యాపారులకు పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వాలి అని చెప్పింది.   

also read 

షాపుకు వెళ్లి ఏదైనా ప్రొడక్ట్‌ను కొనుగోలు చేస్తే డబ్బులు చెల్లించడానికి పలు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, గూగుల్ పే, ఫోన్ పే, భీమ్, క్యాష్ ఇలా ఎన్నో మార్గాల్లో డబ్బులు కట్టేయవచ్చు.  పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి వాటిల్లో ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.

క్యూఆర్ కోడ్ ద్వారా ట్రాన్సాక్షన్ నిర్వహిస్తే పలు రకాల ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులోకి రానున్నాయి. క్యూఆర్ కోడ్ ట్రాన్సాక్షన్లను పెంచేందుకు క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్లు వంటి ఆఫర్లు అందించాలని సూచించింది.

ప్రొడక్ట్‌, యూజర్‌కు సంబంధించిన వివరాలు ఇందులో ఉంటాయి. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బి‌ఐ) ఏర్పాటు చేసిన కమిటీ క్యూఆర్ కోడ్ ట్రాన్సాక్షన్లకు సంబంధించి పలు సిఫార్సులు కూడా చేసింది. ట్రేడర్లు కూడా క్యూఆర్ కోడ్ ట్రాన్సాక్షన్లను స్వీకరించడాన్ని పెంచేందుకు వారికి పన్ను ప్రోత్సాహకాలు అందించాలని తెలిపింది. 
 

click me!