శాంసంగ్‌ అద్భుతమైన ఆఫర్.. ఆ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు..

Ashok Kumar   | Asianet News
Published : Jul 27, 2020, 11:57 AM IST
శాంసంగ్‌ అద్భుతమైన ఆఫర్.. ఆ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు..

సారాంశం

. శాంసంగ్‌ గెలాక్సీ ఎ51 స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపును శాంసంగ్‌ ప్రకటించిన కొద్ది రోజులకే, దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్‌ గెలాక్సీ ఎ-సిరీస్ నుండి మరో హ్యాండ్‌సెట్ ధరను తగ్గించింది.

న్యూ ఢీల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్ శాంసంగ్‌ అద్భుతమైన ఆఫర్ అందిస్తుంది. శాంసంగ్‌ గెలాక్సీ ఎ51 స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపును శాంసంగ్‌ ప్రకటించిన కొద్ది రోజులకే, దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్‌ గెలాక్సీ ఎ-సిరీస్ నుండి మరో హ్యాండ్‌సెట్ ధరను తగ్గించింది.

ఇప్పుడు శాంసంగ్‌ గెలాక్సీ ఎ 21 స్మార్ట్ ఫోన్ ధరను కంపెనీ తగ్గించింది. టాప్-ఎండ్ వేరియంట్ 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ హ్యాండ్‌సెట్ ధరను రూ .1000 తగ్గించి, రూ .17,499కు  కంపెనీ అందిస్తుంది.

స్మార్ట్ ఫోన్ కొత్త తగ్గింపు ధరను  శాంసంగ్‌ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్లలో చూడవచ్చు. శాంసంగ్‌ ఇండియా ట్విట్టర్ ఖాతా ద్వారా ధర తగ్గింపు ప్రకటనను అధికారికంగా ప్రకటించారు.

శాంసంగ్‌ గెలాక్సీ ఎ21లకు మరో మోడల్ కూడా ఉంది, 4 జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ బేస్ వేరియంట్. ఈ వేరియంట్ ధరలో ఎలాంటి మార్పు లేదు ఎందుకంటే దీనిని లాంచ్ చేసిన ధర రూ .16,499కే విక్రయిస్తుంది. 

also read ఒప్పో నుండి లేటెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్.. ధర ఎంతంటే ? ...

శాంసంగ్‌ గెలాక్సీ ఎ21 ఎస్ ఫీచర్లు

గెలాక్సీ ఎ21ఎస్ 720x1600 పిక్సెల్ రిజల్యూషన్‌, 6.5-అంగుళాల హెచ్‌డి ప్లస్ ఇన్ఫినిటీ ఓ డిస్‌ప్లే, మాలి జి52 జిపియుతో శామ్‌సంగ్ ఆక్టా-కోర్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఫోన్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌, ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో 48 ఎంపి సెన్సార్, ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో 8 ఎంపి అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 2 ఎంపి డెప్త్ కెమెరా, ఎ F / 2.4 ఎపర్చర్‌తో 2MP మాక్రో కెమెరా ఉన్నాయి.

ముందు వైపు, f / 2.2 ఎపర్చర్‌తో 13ఎం‌పి కెమెరా ఉంది. 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 512 జిబి వరకు మైక్రో ఎస్‌డి కార్డ్ సపోర్ట్‌, 4 జి, వోల్‌టిఇ, 3జి, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్, యుఎస్‌బి టైప్ సి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

PREV
click me!

Recommended Stories

Best Camera Phones : 2025లో టాప్ 5 కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే
Starlink : ఎలన్ మస్క్ స్టార్‌లింక్ భారత్‌లో స్టార్ట్ : ప్లాన్‌లు, స్పీడ్, సైన్‌అప్.. ఫుల్ డిటెయిల్స్ ఇవే