సంక్రాంతి కానుకగా బిగ్‌ ‘సి’ బంపర్ ఆఫర్....అతి తక్కువ ధరకే....

Ashok Kumar   | Asianet News
Published : Jan 11, 2020, 05:44 PM ISTUpdated : Jan 11, 2020, 05:47 PM IST
సంక్రాంతి కానుకగా బిగ్‌ ‘సి’ బంపర్ ఆఫర్....అతి తక్కువ ధరకే....

సారాంశం

 ప్రముఖ మొబైల్‌ రిటైల్‌ విక్రయ దిగ్గజం బిగ్‌ "సి’ స్టోర్ సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని కస్టమర్లను ఆకర్షించడానికి అమ్మకాలను పెంచుకోవడానికి  ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. 

హైదరాబాద్‌ :దసరా, దీపావళి తరువాత ఇప్పుడు మళ్ళీ న్యూ ఇయర్, సంక్రాంతి పేరుతో అమ్మకాలు, అఫర్లు మొదలయ్యాయి. ప్రముఖ ఆన్ లైన్ ఈ కామర్స్ దిగ్గజ కంపెనీ నుండి ఆఫ్ లైన్ వరకు అన్నీ స్టోర్లలో అఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. వినియోగదారులను, కస్టమర్లను రకరకాల ఆఫర్లతో ఏదో విధంగా ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు.

also read జియో కంటే ఎయిర్‌టెల్‌ టాప్.... దేశవ్యాప్తంగా తొలిసారిగా...

ఈ క్రమంలో ప్రముఖ మొబైల్‌ రిటైల్‌ విక్రయ దిగ్గజం బిగ్‌ "సి’ స్టోర్ సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని కస్టమర్లను ఆకర్షించడానికి అమ్మకాలను పెంచుకోవడానికి  ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. స్మార్ట్ ఫోన్స్ కొనుగోలుపై రూ.12 కోట్ల విలువైన బహుమతులతో పాటు రూ.5 కోట్ల క్యాష్‌ పాయింట్స్‌ కూడా గెలుచుకునే అవకాశాన్ని వినియోగదారులకు కల్పిస్తున్నట్లు బిగ్‌ ‘సి’ ఫౌండర్‌, సీఎండీ బాలు చౌదరి తెలిపారు.

వీటితో పాటు స్క్రాచ్‌ అండ్‌ విన్‌ ద్వారా ఎలక్ట్రోనిక్ ఫ్రిజ్జులు, వాషింగ్‌ మేషిన్లు, ఎల్‌ఈడీ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఒవెన్లు, ట్రాలీ సూట్‌కేసులు, మిక్సర్లు, రైస్‌ కుక్కర్లు కూడా గెలుచుకునే అవకాశం ఉంది అని అన్నారు.ఇంతే కాకుండా వీటితో పాటు మైక్రోమాక్స్‌ ఎల్‌ వన్‌(2జీబీ) మొబైల్‌ అండ్‌ రూ.13,990 విలువ కలిగిన హెచ్‌డీ ఎల్‌ఈడీ టీవీని రూ.8,999కే అందిస్తున్నది.

రూ. 11,990 విలువ కలిగిన లెనోవా కే9 (4జీబీ+64జీబీ మెమొరీ) మొబైల్‌ కొనుగోలు చేసిన వారికి రూ.13,990 విలువైన హెచ్‌డీ ఎల్‌ఈడీ టీవీని ఉచితంగా ఇస్తున్నారు, రూ. 18,990 ధర కలిగిన వివో వై17(4జీబీ+ 128జీబీ) మొబైల్‌పై 19,990 రూపాయల హెచ్‌డీ ఎల్‌ఈడీ టీవీని అందిస్తున్నారు, రూ. 13,499 ధర కలిగిన వివో వై91(3జీబీ+ 32జీబీ) మొబైల్‌పై రూ. 13,990 విలువైన హెచ్‌డీ ఎల్‌ఈడీ టీవీని అలాగే సామ్‌సంగ్‌ మొబైళ్లపై 7.5 శాతం హెచ్‌డీఎఫ్‌సీ క్యాష్‌బ్యాక్‌ ఇస్తుంది.

also read టిక్ టాక్ యాప్ వాడుతున్నారా... జాగ్రత్త, లేదంటే అశ్లీల వీడియోలు...?

రూ. 15,999 ధర కలిగిన మోటరోలా(4జీబీ+64జీబీ) మొబైల్‌పై రూ.10,680 విలువైన వాషింగ్‌ మెషిన్‌ను ఉచితంగా సంస్థ అందిస్తున్నది. అలాగే ప్రతి మొబైల్‌ కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి కూడా పొందవచ్చు. కంపెనీ అవుట్‌లెట్లలో ఎంఐ, టీసీఎల్‌ స్మార్ట్‌ టీవీలను సైతం సంస్థ అందిస్తున్నది. ఆన్‌లైన్‌ వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఇటీవల సంస్థ ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు బిగ్‌ ‘సి’ ఫౌండర్‌, సీఎండీ బాలు చౌదరి చెప్పారు. ఈ యాప్‌ ద్వారా బుకింగ్‌ చేసు కొన్న వారికి కేవలం 90 నిమిషాల్లో డోర్‌ డెలివరీ చేయనున్నట్లు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Best Smartphones : 2025లో టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. ఐఫోన్ నుంచి ఐక్యూ వరకు పూర్తి వివరాలు !
BSNL New Year Plan : జియో, ఎయిర్‌టెల్ కు బిగ్ షాక్ ! బీఎస్ఎన్ఎల్ న్యూ ఇయర్ 2026 సూపర్ ప్లాన్