ఇండియా కంటే అక్కడే ఆపిల్ ఐఫోన్‌ ధరలు చాలా తక్కువ.. ఎంతంటే ?

By Sandra Ashok Kumar  |  First Published Oct 22, 2020, 4:43 PM IST

ఐఫోన్ 12 కొత్త మోడల్స్ ఈ నెల చివరిలో రిటైల్ స్టోర్లలో అందుబాటులోకి వస్తాయి. ఈ సిరీస్‌లో మొత్తం నాలుగు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టింది. యాపిల్ ఐఫోన్ 12 మినీ,  ఐఫోన్ 12,  ఐఫోన్ 12 ప్రొ,   ఐఫోన్ 12  ప్రొ మ్యాక్స్‌  విడుదల చేశారు.


అమెరికా స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ యాపిల్ ఐఫోన్ 12 సిరీస్‌ను ఆవిష్కరించింది. ఐఫోన్ 12 కొత్త మోడల్స్ ఈ నెల చివరిలో రిటైల్ స్టోర్లలో అందుబాటులోకి వస్తాయి. ఈ సిరీస్‌లో మొత్తం నాలుగు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టింది.

యాపిల్ ఐఫోన్ 12 మినీ,  ఐఫోన్ 12,  ఐఫోన్ 12 ప్రొ,   ఐఫోన్ 12  ప్రొ మ్యాక్స్‌  విడుదల చేశారు. మొట్టమొదటిసారి ఆపిల్ సరికొత్త ఐఫోన్ 12 భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి లాంచ్ చేశారు. ఐఫోన్‌ 12, ఐఫోన్‌ 12 ప్రొలను అక్టోబర్‌ 23 నుంచి ప్రీ-ఆర్డర్‌ చేసుకోవచ్చు. 

Latest Videos

undefined

అయితే, కొత్త ఐఫోన్ 12 మోడల్స్ కోసం వినియోగదారులు వేర్వేరు ధరలను చెల్లించాల్సి ఉంటుంది, ఐఫోన్ 12 మోడల్స్ కొనుగోలు చేయడానికి భారతదేశంలో వాటి  ధరలు అత్యంత ఖరీదైవి.

ప్రపంచంలోని 13 ప్రాంతాలలో ఆపిల్  అధికారిక వెబ్‌సైట్ల నుండి ఐఫోన్ 12 నాలుగు మోడళ్ల ధరల ఎలా ఉన్నాయంటే ?

also read నెట్‌ఫ్లిక్స్‌ ఫ్రీ-ట్రయల్ ఆఫర్‌.. వారం రోజులపాటు ఆన్ లిమిటెడ్ కంటెంట్ అక్సెస్.. ...

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఐఫోన్ 12 సిరీస్‌ మోడల్ ఫోన్స్ కొనుగోలు చేయడానికి యు.ఎస్.ఎ, హాంకాంగ్, జపాన్, యుఎఇ (దుబాయ్) ఉత్తమమైన ప్రదేశాలు కాగా, భారతదేశంలో వాటి ధరలు  అత్యంత ఖరీదైవి.

ఉదాహరణకు హాంకాంగ్‌లో ఐఫోన్ 12 మినీ (64 జిబి) ధర $ 5999 (అంటే సుమారు రూ.56,804) అయితే భారతదేశంలో దీని ధర రూ.69,900 ఉంటుంది. హాంకాంగ్ లో ఐఫోన్ 12 ప్రో మాక్స్ (128 జిబి) కొనుగోలు చేస్తే మీరు రూ.89,005 చెల్లించాలి.అయితే ఇదే మోడల్‌ భారతదేశంలో రూ.1,29,900 ఖర్చవుతుంది, అంటే రూ.40,895 అధికం.

అలాగే ఐఫోన్ 12 (64 జిబి) మోడల్ ధర దుబాయ్‌లో ఏ‌ఈ‌డి 2999, ఇండియాలో రూ.59,964. ఐఫోన్ 12ను కొనుగోలు చేయడానికి యు.ఎస్ చౌకైన ప్రదేశం, ఎందుకంటే అక్కడి ధరలో సేల్ టాక్స్ లేదు. ఒకవేళ సేల్ టాక్స్ ఉన్న  ఐఫోన్ 12 కొనలంటే ఇప్పటికీ యుఎస్‌లో తక్కువ ఖర్చు అవుతుంది.

ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ, యు.కే వంటి దేశాలలో ఐఫోన్ 12 ధర ఎక్కువగా ఉంది. ఉదాహరణకు యు.కే.లో ఐఫోన్ 12 (64 జిబి) ధర 799 (రూ. 75,905) పౌండ్లు అయితే ఇండియాలో ఒక బేస్ మోడల్ కోసం రూ.79,900 చెల్లించాల్సి ఉంటుంది.

భారతదేశంలో ఐఫోన్‌లపై అధిక ధర నిర్ణయించడం కొత్త విషయం కాదు, ఎందుకంటే అనేక ఆపిల్ పరికరాలకు యుఎస్, జపాన్ వంటి దేశాలలో తక్కువ ఖర్చు అవుతుంది. 130 కోట్ల మందికి నివాసంగా ఉన్న భారతదేశంలో ఆపిల్ ఐఫోన్‌లకు ఎల్లప్పుడూ భారీ డిమాండ్ ఉంది.
 

click me!