గూగుల్ ఉద్యోగులకు అద్భుతమైన ఆఫర్ ...ఒక్కకరికి రూ .75 వేలు...

By Sandra Ashok KumarFirst Published May 27, 2020, 6:20 PM IST
Highlights

 జూలై 6 నుంచి ఇతర నగరాల్లో కూడా తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తుందని ఆల్ఫాబెట్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గూగుల్ తమ ఉద్యోగుల ఇంటి నుండి పనిచేసేందుకు ఆఫీసు ఫర్నిచర్, అవసరమైన పరికరాల ఖర్చుల కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఉద్యోగికి $ 1,000 (సుమారు రూ .75,000) ఇస్తున్నట్లు ప్రకటించింది.

శాన్ఫ్రాన్సిస్కో: ప్రముఖ టెక్ కంపెనీ  గూగుల్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్నా తమ ఉద్యోగులకు బంప‌ర్ ఆఫ‌ర్‌ ఇస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్ ఆంక్షల సడలింపులతో ఉద్యోగులు దశల వారీగా కార్యాలయాలకు తిరిగి వచ్చేలా చర్యలు చేపడుతోంది.

జూలై 6 నుంచి ఇతర నగరాల్లో కూడా తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తుందని ఆల్ఫాబెట్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గూగుల్ తమ ఉద్యోగుల ఇంటి నుండి పనిచేసేందుకు ఆఫీసు ఫర్నిచర్, అవసరమైన పరికరాల ఖర్చుల కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఉద్యోగికి $ 1,000 (సుమారు రూ .75,000) ఇస్తున్నట్లు ప్రకటించింది.

దీంతో పాటు ఈ ఏడాది చివరి వరకు చాలా మంది ఇంటి నుండే పనిచేసే అవకాశం ఉంది.కొంతమంది ఉద్యోగులు మాత్రం ఆఫీసుకు రావాల్సి ఉంటుందని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. జూన్ 10 లోగా సంబంధిత మేనేజర్లు వారి ఉద్యోగులకు సమాచారం ఇస్తారని, వారు వీలైతే ఆఫీసుకు రావాల, లేదా ఇంటి నుంచే పని చేస్తారా అనే విషయాన్ని తెలపాలని తెలిపారు.

also read అంగడిలో అమ్మకానికి ట్రు కాలర్ యుజర్ల డాటా...

వారి వారి సామర్థ్యాలను బట్టి తిరిగి రావాలనుకునే వారికి పరిమితంగా అనుమతినిస్తున్నట్టు పిచాయ్ చెప్పారు. మిగతా అందరికీ ఈ ఏడాది చివరకు  వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఉంటుందని తెలిపారు. ప్రతి రెండు వారాలకు ఒక రోజు ఆఫీసుకు రావాలని దీన్ని బట్టి సుమారు 10 శాతం సిబ్బంది అఫుసులో ఉంటారని దీన్ని ఆలోచించాలని పిచాయ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
 
పరిస్థితులు అనుకున్నట్టు అనుకూలిస్తే రొటేషన్ ప్రోగ్రామ్‌ ద్వారా సెప్టెంబర్ నాటికి  30 శాతం ఉద్యోగుల హాజరు  ఆఫీసులో ఉంటుందని సీఈవో భావించారు."జూన్ 10 లోగా ఆఫీసుకు ఎవరు రావాలి అనేది మీ మేనేజర్ మీకు తెలియజేస్తారు. మిగతా అందరికీ సంవత్సరం చివరినాటికి వర్క్ ఫ్రం హోం ఉంటుంది.

మీకు వీలైతే ఇంటి నుండి పని చేయడానికి మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము "అని పిచాయ్ అన్నారు."సామాజిక దూరం, పరిశుభ్రత మార్గదర్శకాలు, కఠినమైన ఆరోగ్య, భద్రతా చర్యలను తీసుకుంటున్నాము, కాబట్టి మీరు ఆఫీసుకు వెళ్లినప్పుడు కార్యాలయం భిన్నంగా కనిపిస్తుంది" అని గూగుల్ సిఇఒ చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలోని కార్యాలయాలు నెమ్మదిగా తిరిగి ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

click me!