అంగడిలో అమ్మకానికి ట్రు కాలర్ యుజర్ల డాటా...

By Sandra Ashok KumarFirst Published May 27, 2020, 4:54 PM IST
Highlights

ఆన్‌లైన్ ఇంటెలిజెన్స్ సంస్థ సైబుల్ నివేదిక ప్రకారం 4.75 మిలియన్ల భారతీయుల వ్యక్తిగత డేటాను డార్క్ వెబ్‌లో $ 1,000 (సుమారు రూ .75,000 కు) కు అమ్మాకానికి పెట్టారు.

ఆన్‌లైన్ ఇంటెలిజెన్స్ సంస్థ సైబుల్ నివేదిక ప్రకారం 4.75 మిలియన్ల భారతీయుల వ్యక్తిగత డేటాను డార్క్ వెబ్‌లో $ 1,000 (సుమారు రూ .75,000 కు) కు అమ్మకానికి పెట్టినట్లు గుర్తించింది. ఈ డేటాను ట్రూకాలర్ డేటాబేస్ నుండి సేకరించినట్లు నివేదికలో పేర్కొంది, కాని కంపెనీ ఈ  వాదనలను ఖండించింది.

ఒక ఇమెయిల్ ద్వారా ట్రూకాలర్ డేటాబేస్ హ్యాక్ లాంటివి జరగలేదని, వినియోగదారుల  సమాచారం, వ్యక్తిగత డాటా అంతా సురక్షితంగా సేవ్ చేయబడి ఉందని ట్రూకాలర్ అధికార ప్రతినిధి చెప్పారు.

ట్రూకాలర్ ప్రతినిధి మాట్లాడుతూ, "మేము మా వినియోగదారుల భద్రతను, మా సేవలను చాలా తీవ్రంగా పరిగణిస్తాము. ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాల జరగకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నాము."అని అన్నారు.

also read  ఆరోగ్య సేతులో లోపాలను కనిపెట్టిన వారికి 3 లక్షల బహుమతి

సైబుల్ తన బ్లాగులో “మా పరిశోధకులు ట్రు డాటాను  అమ్మకానికి పెట్టిన వారిని గుర్తించారు, అతను 47.5 మిలియన్ల భారతీయుల ట్రూకాలర్ వివరాలను 1,000 డాలర్లకు (సుమారు రూ .75,000) విక్రయానికి పెట్టినట్టు పేర్కొంది.

ఈ డేటా 2019 నుండి సేకరించినట్టు గుర్తించింది. కానీ ఇంత తక్కువ ధరకు అమ్మకానికి పెట్టడము అనేది మేము కూడా ఆశ్చర్యానికి గురయ్యాము. దీన్ని సేకరించడానికి అతను చాలా సమయాన్ని వెచ్చించి ఉండాలి.

అమ్మకానికి పెట్టిన యూజర్ డేటాలో మొబైల్ నంబర్లు, స్త్రీ, పురుష వివరాలు, నగరం, మొబైల్ నెట్‌వర్క్, ఫేస్‌బుక్ ఐడి మరికొన్ని వ్యక్తిగత వివరాలు ఉన్నాయని గుర్తించింది ”అని బ్లాగ్ లో పేర్కొంది. ఎవరో విభిన్న మార్గాల్లో ఫోన్ నెంబర్లు, వివరాలను సేకరించి వాటిని ట్రూకాలర్ డాటా పేరిట అమ్ముకునే ప్రయత్నం చేస్తుండొచ్చు అని ట్రు కాలర్ ప్రతినిధి చెప్పారు.

click me!