ఆరోగ్య సేతులో లోపాలను కనిపెట్టిన వారికి 3 లక్షల బహుమతి

By Sandra Ashok KumarFirst Published May 27, 2020, 3:26 PM IST
Highlights

ఆరోగ్యా సేతు  యాప్ ఓపెన్-సోర్స్ కోడ్ డెవలపర్‌ల కోసం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రజలకు కలిగిన ఏవైనా సెక్యూరిటి సమస్యలను పరిష్కరించడానికి ఇది ఒక మంచి మార్గం. భారత ప్రభుత్వం కరోనా వైరస్ ట్రాకింగ్ యాప్ అయిన ఆరోగ్య సేతు యాప్ ను మెరుగుపరచడానికి వీలు అయ్యే అన్నీ మార్గాలను కనుగొలిగిన ఎవరి 1 లక్ష బహుమతిగా ఇవ్వనుంది. 

భారత ప్రభుత్వం తన కరోనా వైరస్ ట్రాకింగ్ యాప్ ఆరోగ్య సేతు యాప్ లో లోపాలను కనుగొన్న ఎవరికి 3 లక్షల బహుమతిని అందిస్తోంది. ఆరోగ్య సేతు యాప్ ని  ఎలా మెరుగుపరచవచ్చో మీరు సూచన చేస్తే  వారికి 1 లక్ష బహుమతిని కూడా పొందవచ్చు అని తెలిపింది. ఆరోగ్యా సేతు  యాప్ ఓపెన్-సోర్స్ కోడ్ డెవలపర్‌ల కోసం విడుదలకు సిద్ధంగా ఉంది.

ప్రజలకు కలిగిన ఏవైనా సెక్యూరిటి సమస్యలను పరిష్కరించడానికి ఇది ఒక మంచి మార్గం. భారత ప్రభుత్వం కరోనా వైరస్ ట్రాకింగ్ యాప్ అయిన ఆరోగ్య సేతు యాప్ ను మెరుగుపరచడానికి వీలు అయ్యే అన్నీ మార్గాలను కనుగొలిగిన ఎవరి 1 లక్ష బహుమతిగా ఇవ్వనుంది.

అలాగే ఇందులో భద్రతా లోపాలను ఎవరైనా కనుగొని ఎత్తి చూపగలిగితే వారికి మరో 3 లక్షలు బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. వినియోగదారుల ఫోన్ నుండి తీసుకున్న డేటాను ఎలా దుర్వినియోగం చేయవచ్చనే దానిపై ఏదైనా లోపాలను లేదా బగ్స్ కనిపెట్టె వారికి ప్రభుత్వం అవకాశం కల్పించింది.

కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్ కోసం ఓపెన్-సోర్స్ కోడ్ విడుదల చేసింది. డెవలపర్‌లు లోపాలను, ఏవైనా లొసుగులను గుర్తించమని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నారు. ఆరోగ్య సేతు యాప్  వెలుగులోకి వచ్చినప్పటి నుండి చాలా మంది భద్రతకు సంబంధించి ఆందోళన చెందుతున్నారు.

also read గ్యాస్‌ కస్టమర్లకు గుడ్ న్యూస్.. వాట్సప్ ద్వారా సిలిండర్ బుకింగ్...

‘బగ్ బౌంటీ’ కార్యక్రమం ద్వారా భారతీయులతో పాటు విదేశీయులకు కూడా ఓపెన్-సోర్స్ కోడ్ తెరిచి ఉంచింది. అయితే బహుమతి కింద ఇచ్చే డబ్బులు క్లెయిమ్ చేయడానికి భారతీయులు మాత్రమే అర్హులు.

ప్రపంచంలో మరెక్కడా కూడా ప్రభుత్వ యాప్  ఓపెన్-సోర్స్ కోడ్ ఈ స్థాయిలో విడుదల చేయాలేదు”అని ఎన్ఐటిఐ ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమితాబ్ కాంత్ ప్రకటించారు. అదే రిపోజిటరీ ద్వారా యాప్‌కు ఏదైనా అప్‌డేట్స్ ఓపెన్ సోర్స్‌గా చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

లాక్ డౌన్ సమయంలో భారత ప్రభుత్వ కరోనా వైరస్  ట్రాకింగ్ యాప్ ఆరోగ్య సేతు వినియోగదారుల డేటాను యాక్సెస్ చేయడానికి అనుమతి కోరడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేకించి భారత ప్రభుత్వం ప్రతి ఒక్కరూ తమ ఫోన్లలో ఉంచడం  ఆరోగ్య సేతు తప్పనిసరి చేసినందున ఆ భయాలను పోగేట్టేందుకు ఈ ఆఫర్ చేసింది.

ట్విట్టర్  ప్రఖ్యాత ఇలియట్ ఆల్డెర్సన్,  రాబర్ట్ బాప్టిస్ట్  ఈ నెల ప్రారంభంలో ఆరోగ్య సేతు యాప్ లో  భద్రతా సమస్య ఉందని ఎత్తి చూపినప్పటి నుండి ఆరోగ్య సేతుకు ఇది చాలా కష్టమైంది. "90 మిలియన్ల భారతీయుల భద్రత ప్రమాదంలో ఉంది" అని ఆయన రాశారు.

click me!