ఫ్లిప్‌కార్ట్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజీనామా... కొత్త సి‌ఎఫ్‌ఓగా శ్రీరామ్ వెంకటరమణ...

By Sandra Ashok Kumar  |  First Published May 5, 2020, 4:05 PM IST

ఫ్లిప్‌కార్ట్‌లో అనేక కీలకమైన బాధ్యతలను విజయవంతంగా  నిర్వహించిన శ్రీరామ్ ఫ్లిప్‌కార్ట్ కామర్స్ సీఎఫ్‌ఓగా బాధ్యతలు స్వీకరించడానికి బాగా సిద్ధంగా ఉన్నారని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. అలాగే చక్కని నాయకత్వం, మార్గదర్శకత్వంలో సమర్ధవంతమైన సేవలు అందించిన ఎమిలీ కు ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కల్యాణ్ కృష్ణమూర్తి కృతజ్ఞతలు తెలిపారు. 

న్యూఢిల్లీ : ఈ కామర్స్ సంస్థ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్  చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా శ్రీరామ్ వెంకటరమణను నియమించినట్లు వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ మంగళవారం తెలిపింది. ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది.

సెప్టెంబర్ 2018 నుండి ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సిఎఫ్‌ఓ ఉన్న ఎమిలీ మెక్‌నీల్  తన పదవికి రాజీనామా చేయడంతో వెంకటరమణని ఆ స్థానంలో నియమించారు. వాల్‌మార్ట్ గ్రూప్ వెలుపల కెరీర్ అవకాశాల కోసం ఆమె అమెరికాకు తిరిగి వెళ్లాలని   నిర్ణయించుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

Latest Videos

 పన్ను, రిస్క్ మేనేజ్‌మెంట్, ట్రెజరీతో సహా ఫ్లిప్‌కార్ట్, మింత్ర  వంటి కీలకమైన ఫైనాన్స్ కార్యకలాపాలు వెంకటరమణ బాధ్యత వహిస్తాడు.ఫ్లిప్‌కార్ట్‌ కార్పొరేట్ అభివృద్ధికి కూడా ఆయన బాధ్యత వహిస్తారని, ప్రొక్యూర్‌మెంట్, ప్లానింగ్ అండ్ అనలిటిక్స్, డెసిషన్ సైన్సెస్ హెడ్‌లు ఆయనకు రిపోర్ట్ చేస్తూనే ఉంటారని ఒక ప్రకటనలో తెలిపింది.

also read కరోనా పై‘ఫేక్ న్యూస్’కు చెక్ పెట్టనున్న గూగుల్...

ఫ్లిప్‌కార్ట్‌లో అనేక కీలకమైన బాధ్యతలను విజయవంతంగా  నిర్వహించిన శ్రీరామ్ ఫ్లిప్‌కార్ట్ కామర్స్ సీఎఫ్‌ఓగా బాధ్యతలు స్వీకరించడానికి బాగా సిద్ధంగా ఉన్నారని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. అలాగే చక్కని నాయకత్వం, మార్గదర్శకత్వంలో సమర్ధవంతమైన సేవలు అందించిన ఎమిలీ కు ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కల్యాణ్ కృష్ణమూర్తి కృతజ్ఞతలు తెలిపారు.

 హైపర్‌లోకల్ ఫ్రెష్ ఫుడ్ సామర్థ్యాలను పెంపొందించే కీలకమైన పెట్టుబడులను నడిపించడంలో మెక్‌నీల్ కీలకపాత్ర పోషించారని, సంస్థ ప్రయాణంలో బలమైన భాగస్వామిగా ఉన్నారని పేర్కొన్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఇటీవల సి‌ఎఫ్‌ఓ, సి‌ఓ‌ఓ గా పనిచేసిన వెంకటరమణ ఇప్పుడు వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్‌లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సి‌ఎఫ్‌ఓ క్రిస్ నికోలస్‌కు రిపోర్ట్  చేస్తాడు.

click me!