వాట్సాప్ డార్క్ మోడ్, వాట్సాప్ గ్రూప్ కాల్స్ లాంటి ఫీచర్లను అప్ డేట్ చేసింది. వినియోగదారుల అవసరానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు వాట్సాప్ తన ఫీచర్స్‌ను అప్‌డేట్ చేస్తూ వస్తున్నది.
సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకురాబోతుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్లలో నిత్యం ఉపయోగించీ ఈ యాప్ కేవలం వ్యక్తిగత జీవితంలోనే కాదు వృత్తి జీవితంలో భాగపోయింది.
తాజా వాట్సాప్ డార్క్ మోడ్, వాట్సాప్ గ్రూప్ కాల్స్ లాంటి ఫీచర్లను అప్ డేట్ చేసింది. వినియోగదారుల అవసరానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు వాట్సాప్ తన ఫీచర్స్‌ను అప్‌డేట్ చేస్తూ వస్తున్నది.
కాకపోతే ఇప్పటికీ ఈ యాప్ విషయంలో ఉన్న అసంతృప్తి ఏంటంటే..? కేవలం ఒకేసారి ఒకటే డివైజ్ లో వాడుకోవచ్చు. మల్టీ డివైజ్ సపోర్ట్ లేకపోవడం. ఇప్పుడు ఆ సదుపాయాన్ని వాట్సాప్ పరీక్షి స్తున్నది.
also read రిలయన్స్ జియో మరో భారీ డీల్... ఫేస్ బుక్ కంటే ఎక్కువ...
ప్రస్తుతం 2.20.143 ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్ రాబోతుందట. వాట్సాప్ ఒక డివైజ్‌లో వాడుతున్నప్పుడు మరొక ఆండ్రయిడ్ డివైజ్‌లో వాడలేం. ఒకవేళ రెండింటిలో వాట్సాప్ వాడాలంటే ఏదైనా ఒకదానిలో వాట్సాప్ పనిచేయదు.
రెండు డివైజెస్ లో ఒకేసారి వాట్సాప్ వాడాలనుకునేవారు ఈ విషయంలో నిరాశకు గురౌతున్నారు. ప్రస్తుతం ఏక కాలంలో ఒకే అకౌంట్ వాడాలంటే ఉన్న ఏకైక ఆప్షన్ వాట్సాప్ వెబ్ మాత్రమే. అయితే, ఈ మల్టీ డివైజ్ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం రాబోతుంది.
ఒకవేళ ఇదే అందుబాటులోకి వస్తే ఒక ఫోన్, టాబ్లెట్ లేదా ఒకటి కంటే ఎక్కువ స్మార్ట్‌ఫోన్లు కలిగి ఉన్నవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్‌తో ఒకేసారి రెండు వేర్వురు ఫోన్లలో వాట్సాప్‌ను వినియోగించుకోవచ్చు. ఇది ఎప్పుడు పూర్తిగా అందుబాటులోకి వస్తుందో వేచి చూడాలి.