ఈ సేల్ ద్వారా అత్యధికంగా అమ్ముడవుతున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ని చౌకైనా ధరకు అందిస్తుంది. ఈ సెల్ డిసెంబర్ 7న ప్రారంభమై డిసెంబర్ 10 వరకు కొనసాగుతుంది.
ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కొత్తగా మొబైల్స్ బొనాంజా సేల్ ని ప్రవేశపెట్టింది. ఈ సేల్ ద్వారా అత్యధికంగా అమ్ముడవుతున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ని చౌకైనా ధరకు అందిస్తుంది. ఈ సెల్ డిసెంబర్ 7న ప్రారంభమై డిసెంబర్ 10 వరకు కొనసాగుతుంది.
మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ఈ సేల్ లో ఆపిల్, శామ్‌సంగ్, షియోమి, ఆసుస్, రియల్‌మీ బ్రాండ్లతో సహ ఇతర స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో పాటు మరెన్నో ఆకర్షణీయమైన్ డీల్స్ అందిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ సెల్ ఆఫర్లలో భాగంగా హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డుపై 1,750 రూపాయల అదనపు తగ్గింపును లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ లో ప్రస్తుతం ప్రత్యక్షంగా ఉన్న కొన్ని డీల్స్ ఇక్కడ ఉన్నాయి:
షియోమీ మీ 10టీ, శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 4, ఆసుస్ రాగ్ ఫోన్ 3, మోటో రాజర్(4జీ వెర్షన్) వంటి స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపును అందించననున్నారు. షియోమి మీ 10టీ ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా డేస్ సేల్ సందర్భంగా రూ.35,999(అసలు ధర రూ.39,999)కి లభిస్తుంది.
అలాగే, ఆసుస్ రోగ్ ఫోన్ 3 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ 44,999 రూపాయలకు లభిస్తుంది. రెడ్‌మీ 9ఐ 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999 నుంచే ప్రారంభం కానుంది. రియల్ మీ నార్జో 20 ప్రోపై కూడా రూ.1,000 తగ్గింపును అందించారు.
దీంతో ఈ ఫోన్ ధర రూ.13,999 నుంచి ప్రారంభం కానుంది. ఒప్పో ఏ31 ధర కూడా రూ.10,990కు తగ్గింది. ఇక మోటో జీ9 ధర రూ.9,999 నుంచి ప్రారంభం కానుంది. ఐఫోన్ ఎస్ఈ 64 జీబీ వేరియంట్ ధర రూ.32,999 నుంచి ప్రారంభం కానుంది.
శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 41 రూ.15,499(అసలు ధర రూ.19,999)కి లభిస్తుంది. కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 5 శాతం ఆన్ లిమిటెడ్ క్యాష్‌బ్యాక్‌తో పాటు ఎక్స్ఛేంజ్, ఇఎంఐ ఆఫర్‌లను కూడా పొందవచ్చు.