రిలయన్స్ జియో 5జిపై ముకేష్ అంబానీ కీలక ప్రకటన.. వచ్చే ఏడాదిలో బడ్జెట్ ధరకే 5జి సేవలు.

By S Ashok Kumar  |  First Published Dec 8, 2020, 12:10 PM IST

2021 రెండవ త్రైమాసికంలో రిలయన్స్ జియో భారతదేశంలో 5జి నెట్‌వర్క్‌కు నాయకత్వం వహిస్తుందని ఐఎంసి 2020 మొదటి రోజున రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తెలిపారు. దీని కోసం పూర్తి సన్నాహాలు జరుగుతున్నయి అని అన్నారు. బడ్జెట్ ధరకే జియో 5జి సేవలను భారత్‌లో విడుదల చేయనున్నట్లు అంబానీ తెలిపారు. 


ముంబై: రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ భారతదేశంలో 5జి టెక్నాలజి సేవలను 2021 ద్వితీయార్థంలో అమలు చేస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) చైర్మన్ ముకేష్ అంబానీ తెలిపారు. ఐదవ తరం వైర్‌లెస్ సేవకు పరిష్కారం దేశీయంగా నిర్మించబడుతుందని అంబానీ అన్నారు.

 ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2020 నేడు ప్రారంభమైంది. భారతదేశంలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ నిర్వహించడం ఇది నాల్గవసారి. ప్రతి సంవత్సరం మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ బార్సిలోనాలో నిర్వహిస్తారు. అదే తరహాలో ఈసారి ఇండియా మొబైల్ కాంగ్రెస్ భారతదేశంలో నిర్వహించారు. ఐఎంసిలో భారతదేశంతో పాటు విదేశాలలో ఉన్న అన్ని ప్రధాన టెక్నాలజీ, ఐటి కంపెనీలు పాల్గొంటాయి.

Latest Videos

అలాగే వారి ఉత్పత్తులను ప్రారంభిస్తుంది. ఈసారి ఇండియాలో ఈ ఈవెంట్ చాలా స్పెషల్ గా జరగబోతోంది. ఐఎంసి 2020ను టెలికమ్యూనికేషన్ విభాగం, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) నిర్వహిస్తున్నాయి. ఐఎంసి 2020 నేటి నుండి ప్రారంభమై అంటే డిసెంబర్ 8 నుండి 10 వరకు 3 రోజులపాటు ఉంటుంది. 

2021 రెండవ త్రైమాసికంలో రిలయన్స్ జియో భారతదేశంలో 5జి నెట్‌వర్క్‌కు నాయకత్వం వహిస్తుందని ఐఎంసి 2020 మొదటి రోజున రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తెలిపారు. దీని కోసం పూర్తి సన్నాహాలు జరుగుతున్నయి అని అన్నారు. బడ్జెట్ ధరకే జియో 5జి సేవలను భారత్‌లో విడుదల చేయనున్నట్లు అంబానీ తెలిపారు. 

also read 

డిజిటల్ ప్రపంచంలో 30 కోట్ల మంది భారతీయులు ఇప్పటికీ 2జి టెక్నాలజీలో ఊన్నారని, వారు భారతదేశ డిజిటల్ ఎకానమీలో చేరడానికి, దాని నుండి ప్రయోజనం పొందటానికి వీలుగా చర్యలు తీసుకోవాలని ముకేష్ అంబానీ ప్రభుత్వాన్ని కోరారు. 30 కోట్ల మంది భారతీయులను 2జి నుండి విడిపించి స్మార్ట్‌ఫోన్‌లకు మారే విధానాన్ని రూపొందించాలని ఆయన ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. 

 ప్రధానమంత్రి నరేంద్ర మోడి సెల్ఫ్ రిలయంట్ ఇండియా మిషన్ విజయానికి జియో స్వదేశీ 5జి టెక్నాలజీ ఒక ఉదాహరణ అని ముకేష్ అంబానీ అన్నారు. 

ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌కు 30కి పైగా దేశాల నుండి 210 మంది జాతీయ, అంతర్జాతీయ స్పీకర్లు, 3 వేలకు పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. ఐఎంసి 2020లో వివిధ మంత్రిత్వ శాఖలు, టెలికాం కంపెనీల సిఇఓలు, గ్లోబల్ సిఇఓలు, 5-జి టెక్నాలజీ నిపుణులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి), డేటా అనలిటిక్స్, క్లౌడ్ అండ్ ఎడ్జ్ కంప్యూటింగ్, బ్లాక్‌చెయిన్, సైబర్-సెక్యూరిటీ నిపుణులు పాల్గొంటారు.

జియో ప్లాట్‌ఫాంలు దాని డిజిటల్ లక్ష్యాలను సాధించడానికి ఈ ఏడాదిలో కేవలం నాలుగు నెలల్లో గూగుల్ ఇంక్, ఫేస్‌బుక్ వంటి పెట్టుబడిదారుల నుండి 1.52 ట్రిలియన్లను సేకరించాయి. క్వాల్కమ్ ఇంక్ పెట్టుబడి విభాగమైన క్వాల్కమ్ వెంచర్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో  0.15% వాటా కోసం రూ.730 కోట్లు పెట్టుబడి పెట్టింది.

click me!