లాంచ్ ముందే ఫావ్-జి గేమ్ హిట్.. 24 గంటల్లో 10 లక్షలకు పైగా ప్రీ-రిజిస్ట్రేషన్లు..

By S Ashok Kumar  |  First Published Dec 3, 2020, 11:09 AM IST

ఫావ్-జి గేమ్ అభివృద్ధి చెందుతున్న సంస్థగా ఎన్-కోర్ గేమ్స్ తెలియజేసింది. కేవలం 24 గంటల్లో గూగుల్ ప్లే స్టోర్‌లో అత్యధిక ప్రీ-రిజిస్ట్రేషన్ నమోదైనట్లు ఎన్-కోర్ గేమ్స్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసింది. 


పబ్-జికి పోటీగా ప్రారంభించిన మేడ్ ఇన్ ఇండియా మల్టీ ప్లేయర్ మొబైల్ గేమ్ ఫావ్-జి సంచలనం సృష్టిస్తుంది. కేవలం 24 గంటల్లో గూగుల్ ప్లే స్టోర్‌లో 10 లక్షల ప్రీ-రిజిస్ట్రేషన్ మార్క్‌ను దాటింది. ఫావ్-జి గేమ్ అభివృద్ధి చెందుతున్న సంస్థగా ఎన్-కోర్ గేమ్స్ తెలియజేసింది.

కేవలం 24 గంటల్లో గూగుల్ ప్లే స్టోర్‌లో అత్యధిక ప్రీ-రిజిస్ట్రేషన్ నమోదైనట్లు ఎన్-కోర్ గేమ్స్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసింది. ఎన్-కోర్ గేమ్స్ ఈ ఏడాది అక్టోబర్‌లో ఫావ్-జి గేమ్ ప్రారంభించాల్సి ఉంది, కానీ నవంబర్ చివరిలో ప్లే-స్టోర్‌లో ఫావ్-జి  గేమ్ కోసం ప్రీ-రిజిస్ట్రేషన్ కోసం లింక్ ని అందుబాటులోకి తెచ్చింది.

Latest Videos

undefined

 ఈ లింక్ ద్వారా ఫావ్-జి గేమ్ కోసం ప్రీ-రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి గేమ్ అందుబాటులోకి రాగానే డౌన్ లోడ్ చేసుకోమని నోటిఫికేషన్ అందిస్తుంది. 

ఫావ్-జి గేమ్ ను గూగుల్ ప్లే-స్టోర్‌లో నవంబర్ 30న కంపెనీ ప్రత్యక్ష ప్రసారం చేసింది. అప్పటి నుండి ప్రీ-రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉండగా,  ఫావ్-జి గేమ్ ప్రారంభ తేదీ గురించి కంపెనీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

also read 

ఫావ్-జి  గేమ్ పూర్తి పేరు ఫియర్లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్. ఫావ్-జి  గేమ్ ఇండియన్ గేమ్ డెవలపర్ కంపెనీ ఎన్-కోర్ గేమ్స్ సృష్టించి అభివృద్ది చేసిన ఇండియా గేమ్ యాప్.

ఎన్-కోర్ సహ వ్యవస్థాపకుడు విశాల్ గొండాల్ మాట్లాడుతూ, ఈ గేమ్ పబ్-జి గేమ్ ని భర్తీ చేస్తుంది. పబ్-జి లాగానే ఫావ్-జి స్థానికంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతుంది. ఈ గేమ్ ద్వారా వచ్చే ఆదాయంలో 20% వీర్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు వెళ్తుంది.

'భారత్ కే వీర్' అనేది ఆర్మీ సిబ్బందికి అంకితమైన సంస్థ, దీనిని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్థాపించింది. కొన్ని రోజుల క్రితం ఫావ్-జి గేమ్ టీజర్‌ను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విడుదల చేశారు. ఫావ్-జి గేమ్ మొదటి ఎపిసోడ్ గాల్వన్ వ్యాలీ సంఘటన ఆధారంగా రూపొందించబడింది. ఫావ్-జి గేమ్ లో భారత సైన్యం రూపంలో ప్లేయర్స్ ని చూపించారు.

 గాల్వాన్ లోయలో ఇండియా-చైనా సరిహద్దుల మధ్య జరిగిన ఘర్షన కారణంగా భారత ప్రభుత్వం పబ్-జి గేమ్ తో సహ వందకి పైగా చైనా యాప్స్ ని నిషేదించిన విషయం మీకు తెలిసిందే.

 

Thank you for a fantastic response! Highest number of pre-registrations in India in less than 24 hours!

1+ million and counting...

Pre-register now at: https://t.co/4TXd1F7g7J pic.twitter.com/jXXStGFlWR

— nCORE Games (@nCore_games)
click me!