అమెజాన్ వావ్ సాలరి డేస్ సేల్ 2020: ల్యాప్‌టాప్‌, ఎలక్ట్రానిక్స్ పై 50% డిస్కౌంట్ ధరకే..

Ashok Kumar   | Asianet News
Published : Dec 02, 2020, 02:25 PM ISTUpdated : Dec 02, 2020, 10:52 PM IST
అమెజాన్ వావ్ సాలరి డేస్ సేల్ 2020: ల్యాప్‌టాప్‌, ఎలక్ట్రానిక్స్ పై 50% డిస్కౌంట్ ధరకే..

సారాంశం

అమెజాన్ వావ్ సాలరి డేస్ సేల్ లో ల్యాప్‌టాప్‌ల పై 30 శాతం, టాబ్లెట్‌లపై 50 శాతం తగ్గింపును అందిస్తుంది. ఈ అమెజాన్ సెల్ డిసెంబర్ 3 వరకు నడుస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుపై ఈ సెల్‌లో 10% ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

మీరు కూడా చౌకైన ల్యాప్‌టాప్ కొనాలని చూస్తున్నరా, అయితే ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌లో అమెజాన్ వావ్ సాలరి డేస్ సేల్ ప్రారంభించింది. అమెజాన్ వావ్ సాలరి డేస్ సేల్ లో ల్యాప్‌టాప్‌ల పై 30 శాతం, టాబ్లెట్‌లపై 50 శాతం తగ్గింపును అందిస్తుంది.

ఈ అమెజాన్ సెల్ డిసెంబర్ 3 వరకు నడుస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుపై ఈ సెల్‌లో 10% ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ సెల్ లో అమెరికన్ కంపెనీ అవిటా ల్యాప్‌టాప్‌ను రూ .17,990కే  కొనుగోలు చేయవచ్చు, హెచ్‌పి, డెల్, మైక్రోసాఫ్ట్ ల్యాప్‌టాప్‌లపై 30 శాతం తగ్గింపుతో లిస్ట్ చేశారు.

13.5 అంగుళాల మైక్రోసాఫ్ట్ ల్యాప్‌టాప్ మోడల్ ధర రూ.90,990 లిస్ట్ చేశారు, దీని అసలు ధర రూ.98,999.

also read ఈ ఐఫోన్ ధర అక్షరాల 11 లక్షలు.. అవును నిజమే, అంతా ధర ఎందుకొ తెలుసా.. ? ...

ఈ సేల్‌లో జాబ్రా, బోట్, సోనీ, జెబిఎల్ వంటి బ్రాండెడ్ హెడ్‌ఫోన్‌లపై 50 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అలాగే ఈ కంపెనీల సౌండ్‌బార్‌లపై 30 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.

అంతేకాకుండా  అమెజాన్ కూడా ప్రీమియం హెడ్‌ఫోన్‌లు, స్పీకర్లపై ఖర్చు లేని ఈ‌ఎం‌ఐ ఆప్షన్ అందిస్తోంది. ఈ అమెజాన్ సేల్‌లో ఎయిర్‌పాడ్స్ ప్రోను రూ.20,990కు కొనుగోలు చేయవచ్చు, దీని అసలు ధర రూ.24,990 కాగా, శామ్‌సంగ్ గెలాక్సీ బడ్స్ ప్లస్ ధర రూ.8,990 ధరతో జాబితా చేసింది.

ఈ సేల్‌లో డీఎస్‌ఎల్‌ఆర్, మిర్రర్‌లెస్, పాయింట్ కెమెరాలను రూ.27,990 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు.


 

PREV
click me!

Recommended Stories

Best Camera Phones : 2025లో టాప్ 5 కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే
Starlink : ఎలన్ మస్క్ స్టార్‌లింక్ భారత్‌లో స్టార్ట్ : ప్లాన్‌లు, స్పీడ్, సైన్‌అప్.. ఫుల్ డిటెయిల్స్ ఇవే