శామ్సంగ్ గెలాక్సీ నోట్ పెద్ద స్క్రీన్‌కు, నోట్ మేకింగ్ కి స్టైలస్ ప్రసిద్ది చెందింది, ఇది శామ్‌సంగ్ ప్రీమియం ఫోన్ సిరీస్‌లలో ఒకటి, మరొకటి కాంపాక్ట్ గెలాక్సీ ఎస్.
వచ్చే ఏడాది నుండి ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజ సంస్థ శామ్‌సంగ్ ప్రీమియం గెలాక్సీ నోట్ ఫోన్‌ను నిలిపివేయనున్నట్లు కొన్ని వర్గాలు తెలిపాయి, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ల డిమాండ్ గణనీయంగా తగ్గుతు వస్తుంది.
శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ పెద్ద స్క్రీన్‌కు, నోట్ మేకింగ్ కి స్టైలస్ ప్రసిద్ది చెందింది, ఇది శామ్‌సంగ్ ప్రీమియం ఫోన్ సిరీస్‌లలో ఒకటి, మరొకటి కాంపాక్ట్ గెలాక్సీ ఎస్.
undefined
ప్రస్తుతం దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్‌సంగ్ 2021 కొరకు గెలాక్సీ నోట్ కొత్త వెర్షన్‌ను అభివృద్ధి ప్రణాళికలు లేనట్లు కొన్ని వర్గాలు తెలిపాయి.
దీనికి బదులుగా గెలాక్సీ ఎస్ సిరీస్ టాప్ మోడల్ అయిన ఎస్ 21 స్టైలస్ కి ఉంటుంది. శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్ తదుపరి వెర్షన్ స్టైలస్‌తో అనుకూలంగా ఉంటుందని, ఇది విడిగా విక్రయించబడుతుందని సమాచారం.
also read
సంస్థ అభివృద్ధి పనులను సాధారణంగా నోట్‌పై పంపించేది, ఇప్పుడు దాని ఫోల్డబుల్ ఫోన్ పరిధిలోకి మార్చనుంది. అయితే వీటి పై వ్యాఖ్యానించడానికి శామ్‌సంగ్ నిరాకరించింది.
సామ్‌సంగ్ నోట్ సిరీస్ అమ్మకాలు ఈ ఏడాది 5 నుంచి 8 మిలియన్లకు తగ్గుతాయని, ఎస్ సిరీస్ అమ్మకాలు 5 మిలియన్ల నుంచి 30 మిలియన్లకు తగ్గే అవకాశం ఉందని పరిశోధనా సంస్థ విశ్లేషకుడు తెలిపారు."ఈ సంవత్సరం ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ డిమాండ్ తగ్గింది, అలాగే చాలా మంది కొత్త ఉత్పత్తుల కోసం చూడటం లేదు" అని ఆయన అన్నారు.
గెలాక్సీ నోట్ 20 ఈ ఏడాది యునైటెడ్ స్టేట్స్లో 999 డాలర్ల (సుమారు రూ. 73,400) ధరతో లాంచ్ చేశారు, గెలాక్సీ ఎస్ 20తో సమానంగా ఐఫోన్ 12ని 799 డాలర్లతో(సుమారు రూ.58,700) ధరతో మార్కెట్లోకి తీసుకొచ్చింది.
శామ్సంగ్ మొట్టమొదటిసారిగా 2011లో నోట్‌ను విడుదల చేసింది, పెద్ద స్క్రీన్ మోడళ్ల కోసం మార్కెట్లో రికార్డు బద్దలు కొట్టి, ఆపిల్‌ను అధిగమించి ఆ సంవత్సరంలో తొలిసారిగా ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థగా నిలిచింది.