స్మార్ట్ ఫోన్లను వదలని కరోనా ప్రభావం..తగ్గిన సేల్స్: తాజా సర్వే

By Sandra Ashok Kumar  |  First Published Jun 3, 2020, 11:45 AM IST

కరోనా మహమ్మారి ప్రభావంతో స్మార్ట్ ఫోన్ల విక్రయాలు తగ్గుముఖం పట్టాయని మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే 13-15 శాతం తగ్గుతాయని తెలిపింది. 
 


న్యూఢిల్లీ: ఇండియాలో తొలిసారిగా స్మార్ట్‌‌‌‌ఫోన్ల మార్కెట్‌‌‌‌ వ్రుద్ధిరేటు ‌‌‌‌తగ్గుతున్నది. కరోనా మహమ్మారిని నియంత్రించడానికి విధించిన లాక్‌‌‌‌డౌన్‌‌‌‌వల్ల అమ్మకాలు బాగా తగ్గుతాయని తాజా స్టడీ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి అమ్మకాలు 13–15 శాతం వరకు తగ్గుతాయని మార్కెట్‌‌‌‌ రీసెర్చ్‌ ‌‌‌సంస్థ ఇంటర్నేషనల్‌‌‌‌ డేటా కార్పొరేషన్ ‌‌‌‌(ఐడీసీ) తాజా సర్వే పేర్కొంది.

గత ఏడాది 15.8 కోట్ల వరకు స్మార్ట్‌‌‌‌ఫోన్లు అమ్ముడుకాగా, ఈ ఏడాది ఇవి 13 కోట్లకు తగ్గుతాయని అంచనా వేసింది. స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తి ‌‌‌కూడా భారీగా తగ్గుతుందని ఇది స్పష్టం చేసింది. ఐడీసీ సర్వే ప్రకారం లాక్‌‌‌‌డౌన్‌‌‌‌వల్ల కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారని, చాలా మంది జీతాలు తగ్గిపోయాయని తేలింది. 

Latest Videos

అన్ని రకాల వ్యాపారాలు ఎన్నడూ లేనంత నష్టపోయాయి. దాదాపు అన్ని వర్గాల ఆదాయాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌ కొనాలనుకునే వారు మరికొంత కాలం ఆగుతారు లేదా వాయిదా వేస్తారు.

also read రియల్‌మి లేటెస్ట్ స్మార్ట్‌ టీవీ..తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లు...

లాక్‌‌‌‌డౌన్‌‌‌‌తో తలెత్తిన సమస్యల వల్ల కంపెనీలు ఫోన్లను ఎక్కువగా తయారు చేయలేకపోతున్నాయి. స్మార్ట్‌‌‌‌ఫోన్ల అమ్మకాలపై జీఎస్టీ 12 శాతం నుంచి 18 శాతానికి పెంచడంతో రేట్లు ఎక్కువయ్యాయి.

ఈ ఏడాది 14 కోట్ల యూనిట్లు అమ్ముడవుతాయని మొదట భావించారు. కరోనా లాక్‌‌‌‌డౌన్‌ ‌‌‌తరువాత ఈ అంచనాను ఐడీసీ 13 కోట్ల యూనిట్లకు తగ్గించి వేసింది. గత ఏడాది దేశవ్యాప్తంగా 15.8 కోట్ల వరకు స్మార్ట్‌‌‌‌ఫోన్లు అమ్ముడుపోయాయి. ఫీచర్‌‌‌‌ఫోన్ల అమ్మకాలు 42 శాతం వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. 

గత ఏడాది ఇవి 13 కోట్ల దాకా అమ్ముడయ్యాయి. ఈసారి సేల్స్‌‌‌‌7.5 కోట్లు దాటకపోవచ్చని భావిస్తున్నారు. వలస కూలీలు పనులను వదిలేసి సొంతూళ్లకు వెళ్లిపోవడం, పనులు దొరక్కపోవడం వల్ల ఫీచర్‌‌‌‌ఫోన్ల అమ్మకాలు పడిపోతాయని భావిస్తున్నారు.
 

click me!