గూగుల్ క్రోమ్ వాడుతున్నారా... అయితే మీరు తప్పకుండ చదవాల్సిందే...

By Sandra Ashok Kumar  |  First Published Dec 27, 2019, 12:00 PM IST

ఇక గూగుల్ క్రోమ్.. వెరీ ఇంటరెస్టింగ్.. యూజ్ ఫుల్ ఫీచర్స్..ప్రస్తుత నెట్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు గూగుల్ క్రోమ్ విరివిగా వాడుతున్నారు. అయితే గూగుల్ క్రోమ్ వాడుతున్న వారు తెలుసుకోవాల్సిన సరికొత్త ఫీచర్లను తెలుసుకుందాం..  


న్యూఢిల్లీ: ప్రస్తుతం అంతా ఇంటర్నెట్ వాడుతూనే ఉంటారు. వారికి ఏ అంశంపై సమాచారం కావాలన్నా గూగుల్ క్రోమ్‌ను ఆశ్రయించాల్సిందే. ప్రస్తుత నెట్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు గూగుల్ క్రోమ్ విరివిగా వాడుతున్నారు. అయితే గూగుల్ క్రోమ్ వాడుతున్న వారు తెలుసుకోవాల్సిన సరికొత్త ఫీచర్లను తెలుసుకుందాం..  

వినియోగదారులు క్రోమ్ వాడే సమయంలో ఒక వెబ్ పేజీ నుంచి మరొక వెబ్ పేజీకి వెళ్లేందుకు గూగుల్ తన  క్రోమ్లో ఒక గెస్ట్చర్(నావిగేటర్)ను ప్రవేశపెట్టింది. దీన్ని యాక్టివేట్ చేయాలంటే మీ యూఆర్ఎల్ బార్లో 'క్రోమ్ ://ఫ్లాగ్స్/# ఓవర్ స్క్రోల్-హిస్టరీ-నావిగేషన్' అని టైప్ చేస్తే సరి.

Latest Videos

undefined

also read  బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకు క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ ఆఫర్...

గూగుల్ క్రోమ్ లో గూగుల్ ఓమ్నిబాక్స్ ఉంటుందని సాధారణంగా ఎవరికి తెలియకపోవచ్చు. కానీ క్రోమ్ లోని అడ్రస్ బార్‌లో సాధారణంగా యూఆర్ఎల్ ఉన్న దాన్నే గూగుల్ ఓమ్నిబాక్స్ అంటారు. దీన్ని నేరుగా గూగుల్ సెర్చ్ ఇంజిన్‌కు అనుసంధానం చేశారు. ఈ ఓమ్నిబాక్స్‌లో టైప్ చేసే విషయాలను గూగుల్ నేరుగా తీసుకుంటుందని వినియోగదారులు గమనించాలి.

ఒక్కోసారి పొరపాటుగా మీ ట్యాబ్లను క్లోజ్ చేస్తే పేజ్ రీలోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం నెటిజన్లు కామన్ గా చేసే పని. అలా కుదరకపోతే మళ్లీ కొత్తగా పేజ్ ఓపెన్ చేయాల్సిందే.  ఇక మీదట అలా చేయకుండా క్రోమ్ రికవరింగ్ లాస్ట్ టాబ్స్ అనే ఒక కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. నెట్ యూజర్లు విండోస్‌లో 'కంట్రోల్ + షిఫ్ట్ + టి' నొక్కగానే మీరు ఇంతకు ముందు వాడిన పేజీకి యాక్సెస్ అవుతుంది. 

also read ఒప్పో నుండి కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్...ధర ఎంతంటే...

ఈ ఏడాదే గూగుల్ క్రోమ్‌లో డార్క్ మోడ్ అనే ఆప్షన్ మొదలైంది. కళ్లపై ఒత్తిడి ఏర్పడకుండా ఓఎల్ఈడీ రూపంలో ఇది ఉంటుంది. దీనిని ఎంపిక చేసుకోవాలంటే 'విండోస్>సెట్టింగ్స్> అప్పియరెన్స్'అనే ఆప్షన్‌కు వెళ్లి థీమ్‌ను 'మెటీరియల్ ఇగ్నిటో డార్క్' ఎంచుకోవాలి. అయితే ఈ డార్క్ కోడ్ ఆప్షన్ అనేది మాక్ ఓఎస్ 10.14, విండోస్ 10 వర్షన్లలోనే పనిచేస్తుంది.

అప్పుడప్పుడు నెట్ బ్రౌజింగ్  చేస్తున్నప్పుడు పాపప్ యాడ్స్ వస్తూ చికాకు తెప్పిస్తుంటాయి. ఆ పాపప్ యాడ్స్ ఆపేందుకు కొత్తగా గూగుల్ క్రోమ్‌లో మ్యూట్ సైట్ అనే ఆప్షన్ వచ్చి చేరింది. ఆడియో ప్లే అవుతున్న సమయంలో టాబ్‌పై కుడివైపు క్లిక్ చేసి మ్యూట్ సైట్ క్లిక్ చేస్తే పాప్అప్ యాడ్స్ ఇక కనిపించవు.

click me!