మేధో సంపత్తిలో భారత్ కన్నా గ్రీస్, రోమినియన్ రిపబ్లిక్ దేశాలు ముందు....

By Sandra Ashok Kumar  |  First Published Feb 6, 2020, 12:59 PM IST

పలు సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్థలకు భారతీయులు అధిపతులు అవుతున్నా.. మేధో సంపత్తి హక్కుల సాధనలో భారత్ వెనుకబడే ఉంది. గ్రీస్, రోమినియన్ రిపబ్లిక్ దేశాలు మెరుగైన ర్యాంక్ పొంది ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే 6.71 శాతం పెరిగినా 53 దేశాల్లో భారత్ స్థానం 40వ ర్యాంక్.


న్యూఢిల్లీ: అంతర్జాతీయ మేధో సంపత్తి జాబితాలో భారత్ 40వ స్థానంలో నిలిచింది. 2019తో పోలిస్తే నాలుగు స్థానాలు దిగజారినా, 6.71 శాతం స్కోరు పెరిగినట్లు గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్​ తన నివేదికలో తెలిపింది. మరోవైపు బాలీవుడ్​లో కాపీరైట్ల ఉల్లంఘన అధికంగా జరుగుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది.

మేధో సంపత్తి సూచీలో 40వ స్థానంలో  భారత్​
అంతర్జాతీయ మేధో సంపత్తి(ఐపీ) సూచీలో 40వ స్థానంలో నిలిచింది భారత్​. మేధో సంపత్తి పరిరక్షణ, కాపీరైట్లపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. ఈ ఏడాది నాలుగు స్థానాలు దిగజారినట్లు గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్(జీఐపీసీ) నివేదించింది.మొత్తం 53 దేశాల జాబితాలో భారత్​ 40వ స్థానానికి పరిమితమైంది. గతేడాది 2019లో 50 దేశాల జాబితాలో 36వ స్థానంలో నిలిచింది భారత్​. గతేడాదితో పోలిస్తే భారత్​ స్కోర్ 6.71% మేర మెరుగుపడింది. 

Latest Videos

undefined

also read ఫోన్ల ధరలు పెరుగనున్నాయి...ప్రత్యేకించి ఆపిల్ ‘ఐఫోన్’ కూడా....

2019లో 36.04 శాతం(45) పాయింట్లకు 16.22 మార్కులు సాధించగా ఈ ఏడాది స్కోరు 38.46(50కి 19.23 పాయింట్లు) శాతానికి చేరుకున్నట్లు జీఐపీసీ తన నివేదికలో స్పష్టం చేసింది. 2016లో జాతీయ ఐపీఆర్ విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి మేధో హక్కుల పరిరక్షణ కోసం వినూత్న ఆవిష్కరణలు, సృజనాత్మకతల పెట్టుబడులపై భారత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది’ అని జీఐపీసీ తెలిపింది.

ఈ జాబితాలోకి కొత్తగా వచ్చిన గ్రీస్, డామినికన్ రిపబ్లిక్​ దేశాలు భారత్​ కన్నా మెరుగైన స్థానంలో ఉన్నాయి. ఫిలిప్పీన్స్, ఉక్రెయిన్ దేశాలు భారత్​ను అధిగమించాయి. 2016 నుంచి భారత్​లో పేటెంట్లు, ట్రేడ్​మార్క్​ దరఖాస్తుల ప్రాసెసింగ్​ సమయం గణనీయంగా తగ్గినట్లు జీఐపీసీ పేర్కొన్నది. దేశంలోని ఆవిష్కరణ కర్తలకు ఐపీ హక్కులపై అవగాహన పెంపొందించిందని తెలిపింది. గతేడాది భారత మేధో సంపత్తి వ్యవస్థ బలపడిందని స్పష్టం చేసింది.

also read ఎయిర్ టెల్‌కు భారీ నష్టాలు.. పెరుగనున్న మొబైల్ చార్జీలు?

మరోవైపు ఐపీ ఇండెక్స్​ స్కోర్‌తో ఈ రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నాయన్న విషయం స్పష్టమవుతోందని తెలిపింది.‘కాపీరైట్ ఉల్లంఘించే కంటెంట్​ను యాక్సెస్ చేయడానికి ఢిల్లీ హైకోర్టు 2019లో నిషేధం విధించింది. దీంతో కాపీరైట్ సంబంధిత సూచీలో భారత్ స్థానం మెరుగైంది. ఈ నిషేధంతో బ్రిటన్, సింగపూర్ వంటి దేశాల సరసన భారత్ చేరింది. ఫలితంగా కాపీరైట్ సూచీలో 24 దేశాలకన్నా ముందు వరుసలో నిలిచింది’ అని జీపీఐసీ వివరించింది. 

బాలీవుడ్​లో కాపీరైట్​ హక్కుల ఉల్లంఘన అన్ని రంగాల్లోకెల్లా అత్యధికమని తెలిపింది జీపీఐసీ. పైరసీ వల్ల బాలీవుడ్ 3 బిలియన్ అమెరికన్​ డాలర్లు నష్టపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. అటల్ ఇన్నోవేషన్ మిషన్, మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా పథకాలను విజయవంతం చేయడానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది. మరోవైపు పేటెంట్ సామర్థ్యం, ​​పేటెంట్ అమలు, తప్పనిసరి లైసెన్సింగ్, పేటెంట్ వ్యతిరేకత వంటి సవాళ్లు భారత్​కు పొంచి ఉన్నట్లు వెల్లడించింది.
 

click me!