వీచాట్‌ను బ్యాన్ చేస్తే ఐఫోన్లను నిషేధిస్తాం : అమెరికాకు చైనా వార్నింగ్

By Sandra Ashok Kumar  |  First Published Aug 28, 2020, 6:24 PM IST

విచాట్‌ను అమెరికా నిషేధించినట్లయితే చైనా వినియోగదారులు ఆపిల్‌ను బహిష్కరిస్తుందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి శుక్రవారం హెచ్చరించారు. జనాదరణ పొందిన సోషల్ మీడియా యాప్ విచాట్‌ నిరోధించడానికి యుఎస్ ఆర్డర్‌పై  చైనా ప్రభుత్వం ఘాటుగా స్పందించింది.


విచాట్‌ను అమెరికా నిషేధించినట్లయితే చైనా వినియోగదారులు ఆపిల్‌ను బహిష్కరిస్తుందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి శుక్రవారం హెచ్చరించారు. జనాదరణ పొందిన సోషల్ మీడియా యాప్ విచాట్‌ నిరోధించడానికి యుఎస్ ఆర్డర్‌పై  చైనా ప్రభుత్వం ఘాటుగా స్పందించింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే నెల సెప్టెంబర్ నుండి వీచాట్, చైనాకు చెందిన మరో యాప్ టిక్ టాక్ పై నిషేధం తప్పదు అని ప్రకటించారు. ఈ యాప్స్ దేశ జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని ఆరోపించారు, తాజా ప్రకటనతో చైనా లోని బీజింగ్ - వాషింగ్టన్ మధ్య ఉద్రిక్తతలను మరింత రేకెత్తించారు.

Latest Videos

undefined

చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్ శుక్రవారం "వీచాట్ యాప్ నిషేధిస్తే, చైనీయులు ఐఫోన్, ఆపిల్ ఉత్పత్తులను వాడటంలో ఎటువంటి ఉపయోగం ఉండదు" అంటూ ట్వీట్ చేశారు.

also read 

వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ సాఫ్ట్‌వేర్ ద్వారా అక్సెస్ చేయగల ట్విట్టర్‌లో జావో చేసిన హెచ్చరికపై చైనా సోషల్ మీడియా వినియోగదారులు శుక్రవారం విభిన్న రీతిలో స్పందించారు. చైనాలో  సోషల్ మీడియా షార్ట్ మెసేజ్ ప్లాట్ ఫార్మ్ ట్విట్టర్ ని బ్లాక్ చేసిన విషయం మీకు తెలిసిందే.

"నేను ఆపిల్‌ ఉత్పత్తులను ఉపయోగిస్తాను, అలాగే నేను నా దేశాన్ని కూడా ప్రేమిస్తాను" అని వీబో ప్లాట్‌ఫామ్‌లోని ఒక వినియోగదారుడు పోస్ట్ చేశారు. ఆపిల్ ఎంత మంచిదైనా, అది కేవలం ఫోన్ మాత్రమే తమకు దేశ ప్రయోజనాలే ముఖ్యమని మరొకరు పోస్ట్ చేశారు.

ఆధునిక చైనా ప్రజలు వీచాట్‌ను విడిచిపెడితే ఆత్మను కోల్పోయినట్టే..ముఖ్యంగా వ్యాపారవేత్తలు అని వాదించారు. అయితే చైనా విదేశాంగ ప్రతినిధి వ్యాఖ్యలపై అమెరికా కానీ, అటు ఆపిల్ కంపెనీ గానీ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

చైనాలోని ప్రధాన భూభాగంలో వీక్సిన్ అని పిలువబడే వీచాట్‌ 1.2 బిలియన్లకు పైగా ఆక్టివ్ వినియోగదారులు ఉన్నారు. 2020 రెండవ త్రైమాసికంలో చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఆపిల్ ఎనిమిది శాతం వాటాను కలిగి ఉందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది, హువావే  మాత్రం అగ్ర స్థానంలో కొనసాగుతుంది.
 

click me!