చౌకైన, మరింత సౌకర్యవంతమైన ప్లాన్స్ రిలయన్స్ జియో అందిస్తోంది. ఇందుకోసం రిలయన్స్ జియో 5 చౌకైనా ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను విడుదల చేసింది. రోజుకు 3జిబి డేటాతో ఇతర ప్రయోజనాలు కూడా పొందవచ్చు.
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రోం హోం చేస్తున్నారు. దీని కోసం వారికి మరింత డేటా అవసరం ఉంటుంది. అలాంటి వారికోసం చౌకైన, మరింత సౌకర్యవంతమైన ప్లాన్స్ రిలయన్స్ జియో అందిస్తోంది. ఇందుకోసం రిలయన్స్ జియో 5 చౌకైనా ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను విడుదల చేసింది. రోజుకు 3జిబి డేటాతో ఇతర ప్రయోజనాలు కూడా పొందవచ్చు. వాటి గురించి పూర్తి వివరాలు మీకోసం..
రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్
ఈ ప్లాన్ వాలిడిటీ కేవలం 24 రోజులు మాత్రమే. ప్రతిరోజూ 1జిబి డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ లో మీరు జియో నుండి జియోకు ఆన్ లిమిటెడ్ కాల్స్, ఇతర నెట్‌వర్క్‌లకు 300 నిమిషాల కాల్స్ పొందుతారు. రోజూ 100 ఎస్‌ఎంఎస్‌ల సౌకర్యం కూడా లభిస్తుంది. ఎంటర్టైన్మెంట్ కోసం జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.
undefined
రూ.199 ప్లాన్
ఈ 199 ప్లాన్ 28 రోజుల వాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 1.5 జీబీ డేటా లభిస్తుంది. జియో నుండి జియోకు ఆన్ లిమిటెడ్ కాల్స్, ఇతర నెట్‌వర్క్‌లకు కాల్స్ చేయడానికి మీకు 1000 నిమిషాల టాక్ టైం లభిస్తుంది. ఇది కాకుండా రోజుకు 100 ఎస్ఎంఎస్ లు కూడా చేసుకోవచ్చు. జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ కూడా ఫ్రీ.
also read
రూ.249 ప్లాన్
ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటీ వస్తుంది. ఈ ప్లాన్ తో ప్రతిరోజూ 2జిబి డేటాను పొందవచ్చు. మీరు జియో నుండి జియోకి ఆన్ లిమిటెడ్ కాల్స్, ఇతర నెట్‌వర్క్‌లకు కాల్స్ చేయడానికి 1000 నిమిషాలు టాక్ టైం వస్తుంది. ఈ ప్రణాళికలో రోజుకు 100 ఎస్ఎంఎస్ ప్రయోజనం కూడా లభిస్తుంది. జియో యాప్స్ సభ్యత్వం కూడా ఉచితం.
రూ.349 ప్లాన్
ఈ ప్లాన్ తో ప్రతిరోజూ 3జిబి డేటా అందిస్తుంది. దీని వాలిడిటీ కూడా 28 రోజులు. దీనితో, మీరు జియో నుండి జియోకి అపరిమిత కాల్స్, ఇతర నెట్‌వర్క్‌లకు కాల్స్ చేయడానికి 1000 నిమిషాలు మట్లడుకోవచ్చు. ఇవే కాకుండా రోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు చేసే సదుపాయం కూడా ఉంటుంది. ఈ ప్లాన్ లో జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంచింది.
రూ.399 ప్లాన్
ఈ ప్లాన్ వాలిడిటీ 56 రోజులు. ఈ ప్లాన్‌తో ప్రతిరోజూ 1.5 జీబీ డేటా లభిస్తుంది. దీనితో మీరు జియో నుండి జియోకు అపరిమిత కాల్స్, ఇతర నెట్‌వర్క్‌లకు 2000 నిమిషాల కాల్స్ పొందుతున్నారు. ఈ ప్లాన్ జియో యాప్స్ సభ్యత్వంతో ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.