మిట్రాన్ యాప్‌ అభివృద్ధిలో యువతకు ఉద్యోగాలు .. 5 మిలియన్ల ఫండ్ ప్రకటన..

By Sandra Ashok KumarFirst Published Aug 28, 2020, 5:06 PM IST
Highlights

 టిక్‌టాక్  బ్యాన్ తరువాత దాని స్థానంలో స్వదేశీ యాప్స్ అభివృద్ధి చేయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. ఐఐటికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఈ ఏడాది ఏప్రిల్‌లో మిట్రాన్ అనే యాప్‌ను లాంచ్ చేశారు. ఇది టిక్‌టాక్ లాగానే షార్ట్ వీడియో మేకింగ్ యాప్.

భారతదేశం, చైనా దేశాల మధ్య సరిహద్దు వివాదం తరువాత భారత ప్రభుత్వం 59 చైనా యాప్స్ నిషేధించింది. దీనిలో టిక్‌టాక్  ఇండియాలో బాగా పేరు పొందింది. టిక్‌టాక్  బ్యాన్ తరువాత దాని స్థానంలో స్వదేశీ యాప్స్ అభివృద్ధి చేయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి.

ఐఐటికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఈ ఏడాది ఏప్రిల్‌లో మిట్రాన్ అనే యాప్‌ను లాంచ్ చేశారు. ఇది టిక్‌టాక్ లాగానే షార్ట్ వీడియో మేకింగ్ యాప్. ఇప్పుడు ఈ యాప్ వ్యవస్థాపకులు నెక్సస్ వెంచర్స్ పార్ట్‌నర్స్ నేతృత్వంలో దీని మరింత అభివృద్ధి చేయడానికి 5 మిలియన్ల ఫండ్ ప్రకటించారు. ఈ ఫండ్‌తో యాప్ మరింత అభివృద్ధి చెందుతుంది, అలాగే యువతకు ఉద్యోగాలు కూడా లభిస్తాయి అని తెలిపింది.


మిట్రాన్ యాప్‌ను ప్రారంభించిన సంస్థ  ఈ ఫండ్‌ను ఉపయోగించడం ద్వారా యాప్ యూజర్ ఎంగేజ్‌మెంట్ పెరుగుతుందని, ఉత్పత్తిని అభివృద్ధి కోసం ప్రతిభావంతులైన యువతకు కూడా ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పారు.  

కంటెంట్ క్రియేటర్స్ నెట్‌వర్క్‌ను రూపొందించడానికి
 ఈ ఫండ్ ద్వారా కంటెంట్ క్రియేటర్స్ నెట్‌వర్క్‌ను రూపొందించడానికి కంపెనీ ఒక ప్రణాళికను ముందుకు తెచ్చింది. మిట్రాన్ బ్రాండ్‌ను స్థాపించడానికి టెక్నాలజీకి సంబంధించిన ప్రతి స్థాయి యువతకు అనుగుణంగా ఉద్యోగాలు ఇవ్వబడతాయి.

also read 

టిక్‌టాక్  ఆల్టర్నేటివ్
మిట్రాన్ చిన్న సోషల్ వీడియో యాప్ కావచ్చు, కానీ  ఇది టిక్‌టాక్  యాప్ కి ప్రత్యామ్నాయంగా మారుతుంది. ఐఐటికి చెందిన ఇద్దరు పూర్వ విద్యార్థులు, శివాంక్ అగర్వాల్, అనీష్ ఖండేల్వాల్ దీనిని అభివృద్ధి చేశారు. ఇద్దరూ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లు, గతంలో మేక్ మై ట్రిప్‌లో కూడా పనిచేశారు. మిట్రాన్ యాప్ వినియోగదారులలో బాగా ప్రాచుర్యం పొందింది. టిక్‌టాక్ నిషేధించబడటానికి ముందే ఈ యాప్ 10 మిలియన్ డౌన్‌లోడ్‌లను సాధించింది.

సంస్థ ప్రకారం ఫైనాన్సింగ్‌లో పాల్గొన్న  డీప్ కల్రా (చైర్మన్, మేక్‌ మై ట్రిప్), అమ్రిష్ రౌ (సిఇఒ, పైన్ ల్యాబ్స్), జిటెన్ గుప్తా (వ్యవస్థాపకుడు, జూపిటర్ ), అమర్‌జీత్ బాత్రా (ఎండి, స్పూటిఫై ఇండియా), ఆనంద్ చంద్రశేఖరన్ (ఫేస్ బుక్, మాజీ స్నాప్ డీల్ ఎగ్జిక్యూటివ్), కరణ్ బజ్వా (ఎం‌డి, గూగుల్ క్లౌడ్, ఇండియా), అనేక మంది పెట్టుబడిదారులతో సహా టి.కె కురియన్ (ప్రేమ్‌జీ ఇన్వెస్ట్), మనీష్ విజ్, హరీష్ బాహ్ల్ (స్మైల్ గ్రూప్) కూడా పాల్గొన్నారు.

భారతీయ వినియోగదారుల కోసం 
మిట్రాన్ మిత్రా యాప్ వ్యవస్థాపకుడు, సిఇఒ శివాంక్ అగర్వాల్ మాట్లాడుతూ ఈ యాప్ భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించాము. నెక్సస్ వెంచర్ పార్ట్‌నర్స్ మాతో చేరారు, వారి పోర్ట్‌ఫోలియో కంపెనీలకు గొప్ప ఉత్పత్తులను రూపొందించడంలో సహాయపడటంలో ప్రత్యేకత ఉంది. డిజిటల్ ఎంటర్టైన్మెంట్, ఎంగేజ్ మెంట్ కోసం మిట్రాన్ యాప్ ప్రపంచ స్థాయి ఉత్పత్తిగా మార్చగలుగుతారు. సమాచారం ప్రకారం ప్రస్తుతం మిట్రాన్ యాప్ ప్లే స్టోర్‌లో 33 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లు ఉన్నాయి. ప్రతి నెలా 9 బిలియన్ వీడియో వ్యూస్ పొందుతోంది.
 

click me!