అమ్మకందార్లతో కుమ్మక్కు... అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​​ డిస్కౌంట్ ఆఫర్లపై సీసీఐ ఇన్వెస్టిగేషన్...

By Sandra Ashok Kumar  |  First Published Jan 14, 2020, 12:42 PM IST

ఈ కామర్స్ దిగ్గజ సంస్థలు అమెజాన్, ఫ్లిప్​కార్ట్​లపై కాంపిటిషన్​ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తునకు ఆదేశించింది. భారీ రాయితీలు ప్రకటించడం, తమ వేదికలపై ఎంచుకున్న అమ్మకందార్లతో కుమ్మక్కు అవుతున్నారన్న ఆరోపణలపై విచారణ చేపట్టనుంది. 'ఢిల్లీ వ్యాపార్​ మహాసంఘ్​' దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు సీసీఐ ఈ చర్యలు చేపట్టింది.
 


న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజ సంస్థలు అమెజాన్​, ఫ్లిప్​కార్ట్ తమ ఉత్పత్తుల విక్రయానికి అనుసరిస్తున్న విధి విధానాలు, ప్రకటిస్తున్న రాయితీ​లపై కాంపిటిషన్​ కమిషన్​ అఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తునకు ఆదేశించింది. భారీ రాయితీలు ప్రకటించడం, తమ వేదికలపై ఎంచుకున్న అమ్మకందార్లతో కుమ్మక్కు అవుతున్నారన్న ఆరోపణలపై విచారణ చేపట్టనున్నట్లు పేర్కొంది. అమ్మకాలు చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

also read అమెజాన్ పై పోలీస్ కేసు నమోదు...ఎందుకంటే...

Latest Videos

undefined

ఈ కామర్స్ సంస్థలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని ఆరోపిస్తూ 'ఢిల్లీ వ్యాపార్​ మహాసంఘ్​' దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు సీసీఐ ఈ చర్యలు చేపట్టింది. ఢిల్లీ వ్యాపార్​ సంఘ్​లో అనేక మంది స్మార్ట్​ఫోన్, దాని విడి భాగాలువిక్రయించేవారే అధికం. ఈ-కామర్స్​ సంస్థలు ప్రిఫరెన్షియల్ లిస్టింగ్​, ఎక్స్​క్లూజివ్​ టై-అప్స్​, ప్రైవేట్ లేబుల్స్ వంటి పద్ధతులు అవలంభిస్తున్నాయని ఢిల్లీ వ్యాపార్​ మహాసంఘ్​ ఆరోపించింది. ఇవి ఆరోగ్యకరమైన వ్యాపార పద్ధతులకు పూర్తిగా విరుద్ధమని పేర్కొంది.

సీసీఐ ఉత్తర్వులపై అమెజాన్ ఇండియా ప్రతినిధి స్పందిస్తూ తాము విచారకు పూర్తిగా సహకరిస్తామని అన్నారు. మరోవైపు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్​ ఈ వారంలోనే భారతదేశంలో పర్యటించనుండటం యాదృచ్ఛికం కానున్నది. సీసీఐ ఉత్తర్వులను సమీక్షిస్తున్నట్లు ఫ్లిప్​కార్ట్ ప్రతినిధి తెలిపారు.

also read దేశీయంగా ఐటీ రంగంలో... ఉద్యోగాల జోరు... మూడేళ్లలో 44 శాతం

వ్యాపార చట్టాలను, ఎఫ్​డీఐ నిబంధనలను ఫ్లిప్​కార్ట్​ పూర్తిగా అనుసరిస్తోందని పేర్కొన్నారు. ఎంఎస్​ఎంఈలు, అమ్మకందార్లు, చేతివృత్తులవారు, చిన్నవ్యాపారులకు తమ వేదిక ద్వారా అవకాశం కల్పించామన్నారు. నాణ్యమైన వస్తువులను సరసమైన ధరలకు వినియోగ దారులకు అందిస్తున్నందుకు గర్వపడుతున్నామని ఫ్లిప్ కార్ట్ ప్రతినిధి పేర్కొన్నారు. పారదర్శకంగా వ్యాపారం చేస్తూ లక్షల మందికి ఉద్యోగాలను కల్పించామని ఆయన తెలిపారు.

ఈ కామర్స్​ సంస్థలకు రాయితీలు, ఉద్దేశపూర్వక ధరలతో అమ్మడానికి ఎలాంటి హక్కు లేదు. అంతేకాదు వాళ్లు సొంతంగా ఉత్పత్తులను కలిగి ఉండేందుకూ వీలులేదు. కేవలం ఉత్పత్తి సంస్థలతో వినియోగదారునికి అనుసంధానం చేయటమే వాళ్ల పని. తక్కువ ధరలకు ఉత్పత్తులను అమ్మడం వల్ల వర్తక రంగానికి నష్టాలు వచ్చి అవి దెబ్బతింటాయని విమర్శ ఉంది. 

click me!