అమెజాన్ మరో రికార్డు...ప్రపంచ దేశాలలో 50 శాతం....

By Sandra Ashok KumarFirst Published Jan 24, 2020, 5:16 PM IST
Highlights

అమెజాన్ మ్యూజిక్ గత సంవత్సరంలో బ్రిటన్, జర్మనీ, జపాన్, యుఎస్ దేశాలలో 50 శాతం పెరిగింది. అమెజాన్ మ్యూజిక్ స్పాటిఫైని అధిగమించడానికి ఇంకా చాలా దూరంలో ఉంది. స్పాటిఫై 118 మిలియన్ల పేడ్  సబ్ స్క్రైబర్లతో సహా 248 మిలియన్ల యూజర్లను కలిగి ఉంది.

భారతదేశంలోని ప్రముఖ ఆన్ లైన్ దిగ్గజ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ బుధవారం తన స్ట్రీమింగ్ మ్యూజిక్ సర్వీస్ ప్రపంచవ్యాప్తంగా 55 మిలియన్లకు పైగా సబ్ స్క్రైబర్లను దాటింది. ఇది దాదాపు ఆపిల్ మ్యూజిక్‌కు చేరువలో ఉంది. అమెజాన్ మ్యూజిక్ స్పాటిఫైని అధిగమించడానికి ఇంకా చాలా దూరంలో ఉంది. స్పాటిఫై 118 మిలియన్ల పేడ్  సబ్ స్క్రైబర్లతో సహా 248 మిలియన్ల యూజర్లను కలిగి ఉంది.

also read ఫోన్‌పే యాప్ కొత్త ఫీచర్... కాష్ విత్ డ్రా కూడా చేసుకోవచ్చు...

అమెజాన్  మ్యూజిక్ సెర్వీస్ కు "ప్రపంచవ్యాప్తంగా నమ్మలేని వృద్ధి" ఉందని, ఇందులో అన్‌లిమిటెడ్ మ్యూజిక్ ఆప్షన్‌కు అప్‌గ్రేడ్ చేయడానికి పేడ్ ప్రైమ్ సర్వీస్ సబ్ స్క్రైబర్లలో 50 శాతానికి పైగా పెరుగుదల ఉందని చెప్పారు."ఈ గోప్ప మైలురాయిని చేరుకోవడం మాకు చాలా గర్వంగా ఉంది" అని అమెజాన్ మ్యూజిక్ వైస్ ప్రెసిడెంట్ స్టీవ్ బూమ్ అన్నారు.


"సంగీత శ్రోతల యొక్క అసమానమైన ఎంపికను అందించడం ద్వారా మ్యూజిక్ స్ట్రీమింగ్ కోసం మార్కెట్ స్థలాన్ని విస్తరించడంపై మేము ఎల్లప్పుడూ దృష్టి కేంద్రీకరించాము, ఎందుకంటే వేర్వేరు శ్రోతలకు వేర్వేరు అవసరాలు ఉన్నాయని మాకు తెలుసు."అమెరికాలో ఏటా  అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాలలో 119 డాలర్లు చెల్లించాలి.

ఇంకా ఇందులో భాగంగా పాటు రెండు మిలియన్ల సాంగ్స్ లైబ్రరీకి అలాగే ఆన్‌లైన్ కొనుగోళ్లకు ఉచితంగా, వేగవంతమైన డెలివరీ కూడా అందిస్తుంది. భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ ధర నెలకు రూ. 129,  సంవత్సరానికి రూ. 999 రూపాయలు చెల్లించాలి ఉంటుంది. ప్రైమ్ సభ్యులు కాని వారి కోసం అమెజాన్ అనేక స్ట్రీమింగ్ మ్యూజిక్ సబ్ స్క్రిప్షన్ ఆప్షన్లను కూడా అందిస్తుంది.

also read మార్కెట్లోకి కొత్త వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్‌ కేవలం 1,299కే...

అమెజాన్ మ్యూజిక్ గత సంవత్సరంలో బ్రిటన్, జర్మనీ, జపాన్, యుఎస్ దేశాలలో 50 శాతం వృద్ధి చెందింది. ఫ్రాన్స్, ఇటలీ, మెక్సికో, స్పెయిన్ వంటి కొత్త  దేశ మార్కెట్లలో మ్యూజిక్ లవర్స్ ని గెలుచుకుంటుందని సీటెల్ ఆధారిత సంస్థ తెలిపింది.వివిధ అంచనాల ప్రకారం, ఆపిల్  స్ట్రీమింగ్ మ్యూజిక్ సెర్వీస్ లో గత సంవత్సరం మధ్య నాటికి ప్రపంచవ్యాప్తంగా 60 మిలియన్లకు పైగా సబ్ స్క్రైబర్లు ఉన్నారు.

కాలిఫోర్నియాకు చెందిన ఆపిల్ కంపెనీ తన పాపులర్ డివైజెస్ వినియోగదారులకు డిజిటల్ కంటెంట్ ఇంకా సర్వీస్ కి ప్రాధాన్యతనిచ్చింది. ఎందుకంటే ఇది కేవలం ఐఫోన్ అమ్మకాల ఆదాయంపై ఆధారపడకుండా ఉంటుంది. అమెజాన్ సంస్థ పుస్తకాల నుండి ఇ-కామర్స్, క్లౌడ్ సర్వీసెస్, స్ట్రీమింగ్ వీడియో, మ్యూజిక్ ఇంకా మరిన్నింటికి  విస్తరించింది.

click me!