బిఎస్ఎన్ఎల్ రూ. 247 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ హర్యానా, కర్ణాటక, తమిళనాడులతో సహా అన్నీ ప్రాంతాలలో అందుబాటులో ఉంది.ఈ ప్లాన్ 30 రోజుల పాటు రోజు 3GB హై-స్పీడ్ డేటా అందిస్తుంది.
భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) ఆన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ప్రయోజనాలతో రూ. 247 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రారంభించింది. ఈ ప్లాన్ 30 రోజుల పాటు రోజు 3GB హై-స్పీడ్ డేటా అందిస్తుంది.
ప్రభుత్వ యాజమాన్యంలోని బిఎస్‌ఎన్‌ఎల్ టెల్కో రూ. 998 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ వాలిడిటీని పొడిగించింది. దీనితో పాటు రెండు నెలలు పాటు ఈరోస్ నౌ యాప్ యాక్సెస్ కూడా ఇస్తుంది. ఈ కొత్త మార్పులు మార్చి 10, మంగళవారం నుండి అమల్లోకి వచ్చాయి. హర్యానా, కర్ణాటక, తమిళనాడుతో సహా వివిధ ప్రాంతాల్లో ఇది వర్తిస్తుంది.
also read ఇక్యూ టెక్నాలజీతో లెనోవ కొత్త వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్...
హర్యానా బిఎస్‌ఎన్‌ఎల్ సైట్‌లోని లిస్టింగ్ ప్రకారం రూ. 247 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రోజుకు 250 నిమిషాల ఆన్ లీనిటెడ్ లోకల్, ఎస్‌టిడి వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.
ఈ ప్లాన్లో భాగంగా లోక్‌ధున్ కంటెంట్‌కు ఆక్సెస్ ఇస్తుంది. అలాగే ప్రతిరోజూ 3 జీబీ హై-స్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు చేసుకోవచ్చు. ఇది 30 రోజుల వాలిడిటీ ఉంటుంది. రూ. 247 రిచార్జ్ ప్లాన్ లాంచ్ తో పాటు, బిఎస్ఎన్ఎల్ రూ. 998 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ వాలిడిటీని 240 రోజుల నుండి 270 రోజుల వరకు పొడిగించింది.
also read 8 జీబీ స్టోరేజ్ తో ఆకట్టుకుంటున్న ఒప్పో స్మార్ట్ వాచ్...
ఈ వాలిడిటీ 90 రోజుల పాటు ప్రమోషనల్ ఆఫర్‌గా లభిస్తుంది. రూ. 998 బిఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ ప్రతిరోజూ 2 జిబి హై-స్పీడ్ డేటా ఇస్తుంది.బిఎస్‌ఎన్‌ఎల్ రూ.1,999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ అప్ డేట్ చేసింది. 60 రోజుల అదనపు వాలిడిటీతో రెండు నెలల పాటు ఈరోస్ నౌ సర్వీస్ కు ఫ్రీ యాక్సెస్ కల్పిస్తుంది.
ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 3 జిబి హై-స్పీడ్ డైలీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు చేసుకోవచ్చు. రూ. 1,999 ప్లాన్ సాధారణంగా 365 రోజుల వాలిడిటీ ఉండేది, అయితే తాజా దానిని అప్ డేట్ చేసి 425 రోజులకు పెంచింది.