మార్చి 2019 నుండి అక్టోబర్ 2019 మధ్య తయారు చేసిన కొన్ని ఐప్యాడ్ ఎయిర్ మోడల్స్ లో ఈ సమస్య ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఐప్యాడ్ ఎయిర్ (2019) మోడల్స్ కోసం ఫ్రీ రిపేర్ సర్వీస్ కార్యక్రమ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో తీసుకొస్తుంది.
స్క్రీన్ బ్లాంక్ అవటం, స్క్రీన్ ఫ్లాష్ అవుతుండటం వంటి పలు సమస్యలతో కూడిన ఐప్యాడ్ ఎయిర్ కోసం ఫ్రీ రిపేర్ సర్వీస్ కార్యక్రమాన్ని ఆపిల్ సంస్థ ప్రారంభించింది. థర్డ్-జెనరేషన్ ఐప్యాడ్ ఎయిర్ మోడల్స్ మాత్రమే ఫ్రీ రిపేర్ సర్వీస్ కార్యక్రమానికి అర్హులు అని ఆపిల్ కంపెనీ స్పష్టంగా చెప్పింది. ఇతర ఐప్యాడ్ మోడల్స్ ఈ ఫ్రీ రిపేర్ ప్రోగ్రామ్ వర్తించాదు అని తెలిపింది.
థర్డ్-జెనరేషన్ ఐప్యాడ్ ఎయిర్ మోడల్స్ కోసం ఆపిల్ ఫ్రీ రిపేర్ ప్రోగ్రాం ప్రారంభించింది. అయితే ఐప్యాడ్ ఎయిర్ మోడల్స్ లో బ్లాంక్ స్క్రీన్ సమస్య కారణంగా ఈ ఫ్రీ రిపేర్ ప్రోగ్రాం అందిస్తుంది.
also read కరోనా వైరస్ అరికట్టేందుకు యాక్ట్ ఫైబర్‌నెట్ అధ్భుతమైన ఆఫర్...
మార్చి 2019 నుండి అక్టోబర్ 2019 మధ్య తయారు చేసిన కొన్ని ఐప్యాడ్ ఎయిర్ మోడల్స్ లో ఈ సమస్య ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఐప్యాడ్ ఎయిర్ (2019) మోడల్స్ కోసం ఫ్రీ రిపేర్ సర్వీస్ కార్యక్రమ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో తీసుకొస్తుంది.
ఐప్యాడ్ ఎయిర్ కొనుగోలు చేసి రెండేళ్లపాటు వారంటీ ఉన్న డివైజెస్ కు మాత్రమే ఈ సర్వీస్ పనిచేస్తుంది. ఈ సమస్య ఉన్న ఆపిల్ ఐపాడ్ టాబ్లెట్ యూజర్లు ఈ ఫ్రీ రిపేర్ సర్వీస్ పొందడానికి ఆపిల్ స్టోర్ లేదా ఆథరైజేడ్ సర్వీస్ సెంటర్ లో సంప్రదించి ఉచితంగా రిపైర్ చేసుకోవచ్చు .
ముందుగా ఈ ఫ్రీ రిపేర్ సర్వీస్ కార్యక్రమానికి మీకు అర్హత ఉందో లేదో ఆపిల్ టెక్నికల్ నిపుణులు నిర్ణయిస్తారు. అలాకాకుండా మీరు ఆపిల్ టెక్నికల్ టీమ్ ని సంప్రది ఈ మెయిల్- సర్వీస్ ద్వారా కూడా తేలుసుకోవచ్చు.
వినియోగదారులు తమ ఐపాడ్ లను సర్వీస్ సెంటర్ లకు తీసుకెళ్లేముందు వారి ఐప్యాడ్‌ను ఐక్లౌడ్ లేదా వారి కంప్యూటర్ లో డాటాని బ్యాకప్ చేసుకోవలని ఆపిల్ కంపెనీ తెలిపింది. ఐiప్యాడ్ ఎయిర్ (2019) మోడళ్లలో తలెత్తిన ఈ సమస్యను ఆపిల్ టెక్నికల్ సపోర్ట్ పేజీలో దానికి సంబంధించి పూర్తి వివరాలను వివరించింది.
also read జియో మరో సరికొత్త రికార్డ్: సొంతంగా 5జీ టెక్నాలజీ నెట్‌వర్క్ ?
ఐప్యాడ్ ఎయిర్ యుజర్ల ప్రకారం స్క్రీన్ పెర్మనెంట్ గా బ్లాంక్ స్రీన్ అయిపోవడం, ఒకోసారి స్క్రీన్ ఫ్లాష్ లాగా కూడా అవుతుంది అని వారు చెబుతున్నారు. అయితే ఆపిల్ మాత్రం ఈ సమస్యకు గల కారణాలను మాత్రం వివరించలేదు.
ఇంకో విషయం ఏంటంటే మీరు ఏ దేశంలో లేదా ఏ ప్రాంతంలో అయితే వాటిని కొనుగోలు చేశారో దాని ఆధారంగా ఫ్రీ రిపేర్ సర్వీస్ కార్యక్రమాన్ని పరిమితం చేసింది. ఐప్యాడ్ ఎయిర్ (2019) మోడల్ 10.5-అంగుళాల ఎల్ఈడి రెటినా డిస్‌ప్లే, ఏ12 బయోనిక్ చిప్‌సెట్‌తో ఇది పనిచేస్తుంది.
ఇతర కీ స్పెసిఫికేషన్స్ లో 8 ఎంపి బ్యాక్ కెమెరా, 7 ఎంపి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫ్రంట్ మౌంటెడ్ టచ్‌ఐడి, నాన్ రిమువబుల్ 8134 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉన్నాయి. ఇందులో రెండు స్టోరేజ్ మోడళ్లలో వెరిఎంట్స్ ఉన్నాయి. 3 జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ అలాగే 3 జిబి ర్యామ్, 256 జిబి స్టోరేజ్. ఇది స్పేస్ గ్రే, సిల్వర్, గోల్డ్ మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.