బిఎస్ఎన్ఎల్ తన ల్యాండ్‌లైన్ కస్టమర్ల కోసం ఉచితంగా ‘వర్క్ @ హోమ్’ అనే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రారంభించింది.ప్రస్తుత బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ కస్టమర్లకు ఎటువంటి ఇన్స్టాలేషన్ ఛార్జీలు లేకుండా ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.
చెన్నై: ఇంట్లో బిఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌లైన్ ఉందా? ఇప్పుడు మీరు ఉచిత ఇంటర్నెట్ పొందవచ్చు. ఎలా అంటే ఇప్పుడు బిఎస్‌ఎన్‌ఎల్ తన ల్యాండ్‌లైన్ కస్టమర్ల కోసం ఉచితంగా ‘వర్క్ @ హోమ్’ అనే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రారంభించింది.సబ్ స్క్రిప్షన్ పొందడానికి బిఎస్‌ఎన్‌ఎల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-345-1504 డయల్ చేయండి.
‘వర్క్ @ హోమ్’ ప్లాన్ రోజుకు 5 ఎమ్‌బిపిఎస్ ఉచిత ఇంటర్నెట్‌ను 10 ఎమ్‌బిపిఎస్ స్పీడ్ తో అందిస్తుంది. తరువాత స్పీడ్ 1 జిబిపిఎస్‌కు తగ్గించబడుతుంది. ఇది అప్‌లోడ్‌లు మరియు డౌన్‌లోడ్‌లకు పరిమితి లేని అపరిమిత ప్రణాళిక. బిఎస్‌ఎన్‌ఎల్ ఇన్స్టలేషన్ ఛార్జీలు లేదా ఇతర ఛార్జీలను వసూలు చేయదు.
also read ఒప్పో కొత్త వైర్‌లెస్ నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్స్...
మీకు బిఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌లైన్ కనెక్షన్ లేకపోతే, మీరు క్రొత్త కనెక్షన్‌ని కూడా పొందవచ్చు. తరువాత ఉచిత బ్రాడ్‌బ్యాండ్ ఆఫర్‌ను పొందవచ్చు.అయితే మీరు కొత్త కనెక్షన్ తీసుకున్నపుడు, నెలవారీ రెంట్, ఇతర ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.
బిఎస్‌ఎన్‌ఎల్‌తో పాటు, ప్రస్తుత బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ల స్పీడ్ 300 ఎమ్‌బిపిఎస్ వరకు అప్‌గ్రేడ్ చేయడం ద్వారా ఇంటి నుండి పని చేయడానికి, చేసే ప్రజలకు సహాయపడటానికి ఆక్ట్(ACT) ఫైబర్ నెట్ కూడా ముందుకు వచ్చింది.
also read 31న విపణిలోకి షియోమీ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్...
రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ఇతర ప్రైవేట్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ ప్రొవైడర్ల నుండి ఇలాంటి ఆఫర్లు లేవు.కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి అన్నీ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుండి పని చేయాలని కోరింది.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నివేదించిన సగటు నెలవారీ బ్రాడ్‌బ్యాండ్ వినియోగం 15 శాతం పెరగనున్నట్లు ఒక వార్తాపత్రిక తెలిపింది. పెరుగుతున్న ఇంటర్నెట్ యూసర్ల ట్రాఫిక్‌ను నిర్వహించడానికి టెలికాం కంపెనీలకు ప్రభుత్వం అదనపు స్పెక్ట్రం కేటాయించలేదు, దీని వల్ల ఇంటర్నెట్ స్పీడ్ పై ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఒక నివేదిక తెలిపింది.