చాలా మంది వినియోగదారులకు అసౌకర్యాన్ని కలిగిస్తుందని ఫిర్యాదులు నమోదైన తరువాత ఈ చర్య వచ్చింది. నెంబర్ డయల్ చేశాక కాలర్ మొదట కరోనా వైరస్ అవగాహన ఆడియో క్లిప్ వినిపిస్తుంది, ఈ ఆడియో దాదాపు ఒక నిమిషం వరకు ఉంటుంది.
కొట్టక్కల్: మొబైల్ ఫోన్ వినియోగదారుల డైలర్ ట్యూన్‌గా వినిపించే కరోనా వైరస్ పై అవగాహన ఆడియో క్లిప్‌ను ఆపాలని ప్రభుత్వ నెట్వర్క్ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్‌ఎన్‌ఎల్) నిర్ణయించింది. చాలా మంది వినియోగదారులకు అసౌకర్యాన్ని కలిగిస్తుందని ఫిర్యాదులు నమోదైన తరువాత ఈ చర్య వచ్చింది.
నెంబర్ డయల్ చేశాక కాలర్ మొదట కరోనా వైరస్ అవగాహన ఆడియో క్లిప్ వినిపిస్తుంది, ఈ ఆడియో దాదాపు ఒక నిమిషం వరకు ఉంటుంది. ఇది కలర్ విలువైన సమయాన్ని వృధా చేస్తుంది అని, అత్యవసర సర్వీస్ అంబులెన్స్ కోసం కాల్ చేసినపుడు కూడా వినియోగదారులకు కరోనా వైరస్ ఆడియో క్లిప్ వినిపిస్తుంది.
దీనివల్ల కాల్ కనెక్ట్ అవడానికి ఒక నిమిషం అదనపు సమయం పడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ సర్వీసులకు కాల్స్ చేసిన కరోనా వైరస్ ఆడియో క్లిప్ అభ్యంతరంగా మరటంతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
also read
డిఓటి నుండి వచ్చిన సూచనలను అనుసరించి వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ మహమ్మారిపై సమాచారాన్ని వ్యాప్తి చేయడంలో అవగాహన కల్పించడానికి బిఎస్‌ఎన్‌ఎల్ ఆడియో క్లిప్‌ను బిఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లందరికి డైలర్ ట్యూన్ గా అమలు చేసింది.
తరువాత అన్ని టెల్కో కంపెనీలు కరోనా వైరస్ డైలర్ టోన్‌గా చేర్చాలని ఆదేశించారు. బిఎస్ఎన్ఎల్ కేంద్ర ప్రభుత్వానికి పంపిన ప్రత్యేక అభ్యర్థనపై ఆడియో క్లిప్‌ను ఆపాలని నిర్ణయించింది, కాని ఇతర టెల్కోలు దీనిని నివారించలేవు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం సూచనల మేరకు కరోనా వైరస్ పై అవగాహన ఆడియో క్లిప్‌ను జారీ చేశారు.
కేంద్రం ప్రత్యేక అనుమతితో బిఎస్ఎన్ఎల్ కు నోటీసు జారీ చేశారు. అంతకుముందు ఫేస్ బుక్ తో సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లో దీనిపై భారీగా ప్రచారం జరిగింది. ఫోన్ కాల్స్ చేసేటప్పుడు వచ్చే అవగాహన సందేశాన్ని నిలిపివేయాలని కొందరు డిమాండ్ చేశారు.