తోషిబా పోర్టబుల్ పిసి వ్యాపారంలో ప్రముఖ బ్రాండ్ ఎదిగింది. గత 35 సంవత్సరాలుగా తోషిబా అనేక ఉత్పత్తులను అభివృద్ధి చేసింది. కాగా 1990 నుంచి 2000 వరకూ తొషిబా ల్యాప్‌టాప్‌ల తయారీలో టాప్ కంపెనీల్లో ఉండేది.
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ తోషిబా తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తోషిబా ల్యాప్‌టాప్ వ్యాపారానికి గుడ్ బై చెప్పింది. తోషిబా పోర్టబుల్ పిసి వ్యాపారంలో ప్రముఖ బ్రాండ్ ఎదిగింది.
గత 35 సంవత్సరాలుగా తోషిబా అనేక ఉత్పత్తులను అభివృద్ధి చేసింది. కాగా 1990 నుంచి 2000 వరకూ తొషిబా ల్యాప్‌టాప్‌ల తయారీలో టాప్ కంపెనీల్లో ఉండేది. ఆ కంపెనీ తయారు చేసిన శాటిలైట్ ల్యాప్‌టాప్‌లు భారీ విజయం సాధించాయి.
undefined
కానీ తర్వాత లెనోవా, హెచ్‌పీ, డెల్ వంటి కంపెనీలు రంగ ప్రవేశం చేసి మార్కెట్‌పై భారీగా పట్టు సాధించాయి. ఈ క్రమంలో ఇతర మార్కెట్ల నుంచి తొషిబా తీవ్ర పోటీని ఎదుర్కోవలసి వచ్చింది. డైనబూక్ ఇంక్‌లోని 19.9% వాటాలను షార్ప్ కార్పొరేషన్‌కు బదిలీ చేసినట్లు జపాన్ కంపెనీ తెలిపింది.
also read
తోషిబా 2018లో తోషిబా క్లయింట్ సొల్యూషన్స్ కో లిమిటెడ్ 80.1% షేర్లను బదిలీ చేసింది, దీనికి 2019లో డైనబుక్ అని పేరు మార్చారు. "ఈ బదిలీ ఫలితంగా, డైనబుక్ షార్ప్ పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థగా మారింది" అని తోషిబా ఒక ప్రకటనలో తెలిపింది.
తోషిబా 1985లో మొదటి ల్యాప్‌టాప్ - టి 1100 ను ప్రారంభించింది. ఇది ఒక ఐబిఎం పిసి-అనుకూలమైన ల్యాప్‌టాప్ కంప్యూటర్, ఇంటెల్ 80సి 88 క్లాకింగ్ 4.77 మెగాహెర్ట్జ్ వద్ద, 256 కెబి ర్యామ్‌తో వచ్చింది. టి 1100లో ఇంటర్నల్ స్టోరేజ్ కోసం 3.5 ”ఫ్లాపీ డ్రైవ్, మోనోక్రోమ్ డిస్ ప్లే ఉన్నాయి.
మైక్రోసాఫ్ట్ డాస్ (2.11) ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసింది, 4.1 కిలోల బరువుతో దీని ధర 2వేల డాలర్లు. ఈ మేరకు ”డైనాబుక్‌లోని మిగిలిన 19.9 వాతం వాటాను కూడా షార్ప్ కార్పొరేషన్‌కు బదలాయించాము. దీనితో అధికారికంగా డైనాబుక్ ఇప్పుడు షార్ప్‌కు అనుబంధ సంస్థగా మారిందంటూ” తొషిబా ప్రకటన చేసింది.