బెస్ట్ న్యూస్‌ యాప్‌గా ‘లెట్స్‌అప్‌’ గుర్తింపు.. 3 భాషలలో 35 దేశాలకు..

By Sandra Ashok KumarFirst Published Aug 11, 2020, 4:18 PM IST
Highlights

భారతీయ యాప్స్ వినియోగాన్ని  శక్తివంతం చేయడం, డిజిటల్ ఇండియాని సాకారం చేయడానికి భారతీయ టెక్ స్టార్టప్‌లకు అవకాశం, గుర్తింపు ఇవ్వడానికి  భారత ప్రభుత్వం ఈ ఛాలెంజ్ ప్రారంభించింది. 

అహ్మద్‌నగర్, ఇండియా, ఆగస్టు 11: జ్యూరీ ఆఫ్ డిజిటల్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ న్యూస్ కేటగిరీలో స్పెషల్ అవార్డు కింద భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ మ్యాగజైన్ యాప్ లెట్స్అప్ యాప్ గుర్తింపు పొందింది.

భారతీయ యాప్స్ వినియోగాన్ని  శక్తివంతం చేయడం, డిజిటల్ ఇండియాని సాకారం చేయడానికి భారతీయ టెక్ స్టార్టప్‌లకు అవకాశం, గుర్తింపు ఇవ్వడానికి  భారత ప్రభుత్వం ఈ ఛాలెంజ్ ప్రారంభించింది.

లెట్స్అప్ యాప్ అనేది ఉచిత, యూజర్ ఫ్రెండ్లీ అప్లికేషన్. ఇది సెప్టెంబర్ 2019లో ప్రారంభించారు. ఈ యాప్ దాని వినియోగదారులందరికీ జాతీయ, అంతర్జాతీయ, వినోదం, సాంకేతిక వార్తల నుండి ప్రపంచవ్యాప్తంగా వేగవంతమైన, చట్టబద్ధమైన న్యూస్ అప్ డేట్స్ అందిస్తుంది.

సబ్ స్క్రిప్షన్ గ్రూప్ ద్వారా ఉద్యోగాలు, ఆరోగ్యం, క్రీడలు మొదలైన వాటిపై ఆండ్రాయిడ్, ఐఓఎస్ వంటి అన్ని స్మార్ట్‌ఫోన్ ప్లాట్‌ఫామ్‌లలో ఇంగ్లీష్, హిందీ, మరాఠీ బాషల్లో అర మిలియన్ యూసర్లకు అప్ డేట్స్ అందిస్తుంది. యూసర్ల సంఖ్య రోజురోజుకి ఇంకా పెరుగుతోంది.

వారు ఉత్తమమైన సమాచారాన్ని అందించడమే కాకుండా  ప్రతి పరిశ్రమ రంగంలోని, దేశంలోని తాజా సంఘటనల సమాచారంతో యూసర్లను అప్ డేట్ చేస్తుంది.

also read  ల్యాప్‌టాప్‌ల బిజినెస్‌కి తొషిబా గుడ్‌ బై.. ...


రాష్ట్రంలోని స్థానిక భాషలలో అత్యంత వేగవంతమైన సమాచారం అందించే న్యూస్ ప్రొవైడర్ గా వారు ఇటీవల డిజిటల్ ఇండియా ఆత్మనీభర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్  న్యూస్ కేటగిరీలో మోస్ట్ ప్రామిసింగ్ యాప్ టైటిల్‌ను కూడా సంపాదించారు.

ఈ ఛాలెంజ్‌ను జూలై 4, 2020న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా పాల్గొన్న 7000 టెక్ స్టార్టప్‌లలో లెట్స్ అప్ యాప్ ఒకటి."ఈ గుర్తింపు లభించినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలోని 35 దేశాలకు 3 భాషలలో వార్తలను అందించడంతో పాటు మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ నుండి ఇది పూర్తి మేడ్ ఇన్ ఇండియా యాప్.

మేము ఒక బిలియన్ డౌన్‌లోడ్‌లకు ఎదగాలని కోరుకుంటున్నాము "అని లెట్స్ అప్ యాప్ ఇన్వెస్టర్, వ్యవస్థాపకుడు నరేంద్ర ఫిరోడియా అన్నారు."మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ ను ప్రపంచ పటంలో ఉంచినందుకు మాకు గర్వంగా ఉంది. ప్రభుత్వం ఈ చొరవకు భారీ ప్రోత్సాహాన్ని ఇచ్చింది.

మమ్మల్ని విశ్వసించినందుకు మా చందాదారులందరికీ, మా ప్రయత్నాలను గుర్తించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మంచి కంటెంట్ కోసం భారీ డిమాండ్ ఉంది. మా యాప్ ద్వారా ప్రపంచానికి చేరుకోవడమే నా లక్ష్యం "అని నరేంద్ర ఫిరోడియా తెలిపారు.

ఫిరోడియా ఇటీవలే రాహుల్ నార్వేకర్, ప్రణయ్ ఆంథ్వాల్, సంజీవ్ సిన్హాతో కలిసి డబ్ల్యువైఎన్ స్టూడియో అనే కంటెంట్ క్రియేషన్ ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడులు పెట్టింది. ఆడియో, వీడియో, టెక్స్ట్ ఫార్మాట్‌లో 12 ప్రధాన ప్రాంతీయ భాషల్లో కంటెంట్‌ను సృష్టించడం, ప్రపంచవ్యాప్తంగా సమాచారం చేరవేయడం అతని లక్ష్యం. లెట్స్ అప్ యాప్ ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, హైపర్‌లోకల్ వార్తలను మరింత ప్రసారం చేస్తుంది. 

click me!