అన్నీ నెట్‌వర్క్‌లలో ‌ బెస్ట్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ఏదో తెలుసా...

By Sandra Ashok KumarFirst Published Jan 6, 2020, 2:31 PM IST
Highlights

వోడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో   ఈ మూడు నేట్వర్కులకు టెలికాం రంగంలో గట్టి పోటీ కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం రిలయన్స్ జియో, వొడాఫోన్-ఐడియా, ఎయిర్‌టెల్  రూ .200 లోపు ఉన్న ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను 28 రోజుల వాలిడిటీని అందిస్తున్నాయి.

ప్రస్తుతం టెలీకం రంగంలో అన్నీ నేట్వర్కుల మధ్య రిచార్జ్ ప్లాన్ల యుద్దం నడుస్తుంది. రోజు రోజుకు కొత్తగా సవరించిన రిచార్జ్ ప్లాన్లు ప్రవేశపెడుతున్నారు. వినియోగదారులను ఆకర్షించడానికి వివిధ ప్రయత్నాలను చేస్తున్నారు. వోడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో   ఈ మూడు నేట్వర్కులకు టెలికాం రంగంలో గట్టి పోటీ కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం రిలయన్స్ జియో, వొడాఫోన్-ఐడియా, ఎయిర్‌టెల్  రూ .200 లోపు ఉన్న ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను 28 రోజుల వాలిడిటీని అందిస్తున్నాయి.

also read ఆపిల్ కంపెనీ దాదాపు... 28 సంవత్సరాల గ్యాప్ తరువాత...

ఈ టెలికాం రంగంలో కొనసాగుతున్న ఆర్థిక ఒత్తిడి నేపథ్యంలో 2019 సంవత్సరం చివరినాటికి టెలికం కంపెనీలు తమ ప్రీపెయిడ్ టారిఫ్ రేట్లను పెంచాయి. మూడు ప్రధాన టెలికాం కంపెనీలు అయిన రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా తమ రీఛార్జ్ ప్రణాళికలను సవరించాయి దీంతో ఏ నేట్వర్కు బెస్ట్ ప్రీపెయిడ్ ప్యాక్‌లను అందిస్తుందో ఎంచుకోవడం కస్టమర్లకు కొంచెం కష్టమైంది.


వోడాఫోన్-ఐడియా, ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో నుండి రూ .200 లోపు ఉన్న ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను కనీసం 28 రోజుల వాలిడిటీతో  డేటా, ఎస్ఎంఎస్,కాల్స్ ప్రయోజనాలతో అందిస్తాయి.

వోడాఫోన్-ఐడియా
వోడాఫోన్-ఐడియా ప్రీపెయిడ్ ప్యాక్ కింద రూ.149 రిచార్జ్ 28 రోజుల వాలిడిటీతో మొత్తం 2 జిబి డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్ 300 ఎస్ఎంఎస్‌లను ఇంకా  వాలిడిటీ కాలం మొత్తం అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్యాక్‌లోని అదనపు ప్రయోజనాల కింద వోడాఫోన్ ప్లే ఇంకా జి5 స్ట్రీమింగ్ సేవలకు ఫ్రీ ఆక్సెస్ అందిస్తుంది.

also read ఆపిల్ నుండి రెండు కొత్త మోడళ్ స్మార్ట్ ఫోన్లు

ఎయిర్‌టెల్ 
ఎయిర్‌టెల్ కూడా వోడాఫోన్ ప్యాక్ లాగానే ఈ ప్రయోజనాలను 149 రూపాయలకు అందిస్తోంది. కస్టమర్లకు 28 రోజుల వాలిడిటీతో మొత్తం 2 జిబి డేటా, 300 ఎస్‌ఎంఎస్‌లు ఇంకా ఆన్ లిమిటెడ్ కాలింగ్‌ చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్  రూ .149 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్‌పై అదనపు ప్రయోజనాల కింద వింక్ మ్యూజిక్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ ఉచిత వాడుకోవచ్చు.

రిలయన్స్ జియో
రిలయన్స్ జియో తన కస్టమర్లకు రోజుకు 1.5 జిబి డేటాతో పాటు 100 రోజువారీ ఎస్‌ఎంఎస్‌లను రూ .199 రిచార్జ్ ద్వారా అందిస్తోంది. ఈ ప్రీపెయిడ్ ప్యాక్ వాలిడిటీ 28 రోజులు,ఇంకా  వినియోగదారులు జియో యాప్‌లను కాంప్లిమెంటరీ యాక్సెస్‌ కూడా పొందుతారు. అయితే, ఈ జియో ప్లాన్ మాత్రం ఆన్ లిమిటెడ్ కాలింగ్‌ ఇవ్వట్లేదు. వినియోగదారులు  జియో టు జియో ఆన్ లిమిటెడ్ కాల్స్ ఆన్-నెట్ కాలింగ్, ఆఫ్-నెట్ కాలింగ్ 1000 నిమిషాల FUP ని అందిస్తుంది.
 

click me!