ఆపిల్, ఐఫోన్ యూసర్లకు గుడ్ న్యూస్.. ఇండియాలో మొదటి ఆన్‌లైన్ స్టోర్‌ ప్రారంభం..

By Sandra Ashok Kumar  |  First Published Sep 18, 2020, 11:02 AM IST

"భారతదేశంలో విస్తరిస్తున్నందుకు మేము గర్విస్తున్నాము, మా కస్టమర్లకు మద్దతు ఇవ్వడానికి మేము చేయగలిగినదంతా చేయాలనుకుంటున్నాము" అని ఆపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డీర్డ్రే ఓ'బ్రియన్ అన్నారు.
 


యుఎస్ టెక్ దిగ్గజం ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్‌ను సెప్టెంబర్ 23 న భారత్‌లో ప్రారంభించనున్నట్లు సీఈఓ టిమ్ కుక్ శుక్రవారం ట్విట్టర్‌లో తెలిపారు. "మా కస్టమర్‌లు వారు ఇష్టపడే వారితో అలాగే వారి చుట్టూ ఉన్న ప్రపంచంతో సన్నిహితంగా ఉండటం ఎంత ముఖ్యమో మాకు తెలుసు.

సెప్టెంబర్ 23 న ఆన్‌లైన్‌లో ఆపిల్ స్టోర్‌తో మా కస్టమర్‌లతో కనెక్ట్ అవ్వడానికి, మరింత  చేరువవుతున్నట్టు తెలిపారు" కుక్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.

Latest Videos

undefined

"భారతదేశంలో విస్తరిస్తున్నందుకు మేము గర్విస్తున్నాము, మా కస్టమర్లకు మద్దతు ఇవ్వడానికి మేము చేయగలిగినదంతా చేయాలనుకుంటున్నాము" అని ఆపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డీర్డ్రే ఓ'బ్రియన్ అన్నారు.

వినియోగదారులు సలహాలు, సూచనలు పొందవచ్చని కొత్త ఆపిల్ ఉత్పత్తుల గురించి ఇంగ్లీష్, హిందీ భాషలలో తెలుసుకోవచ్చని ఐఫోన్ తయారీదారు ఆపిల్ హామీ ఇచ్చింది.

also read కలర్ ఓఎస్, 8 జీబీ ర్యామ్ తో ఒప్పో రెనో4 ఎస్‌ఇ లాంచ్.. ...

"కస్టమ్-కాన్ఫిగర్ మాక్ నుండి కొత్త పరికరాలను ఏర్పాటు చేయడం వరకు ఏదైనా సహాయం చేయడానికి ఆపిల్ స్పెషలిస్టులు అందుబాటులో ఉంటారు" అని కంపెనీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

కుపెర్టినో-ప్రధాన కార్యాలయం మాక్ లేదా ఐప్యాడ్ కొనుగోలు చేసే విద్యార్థులకు ప్రత్యేక ధర లభిస్తుందని పేర్కొంది.

అంతేకాక పండుగ సీజన్లో ఆపిల్ సిగ్నేచర్ గిఫ్ట్ వ్రాప్ కూడా అందిస్తోంది. అలాగే ఆపిల్ ఇతర యాక్ససరీస్, కేర్ ఉత్పత్తులపై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది

"ఇంగ్లీష్, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళం, తెలుగు భాషలలో ఎమోజిలు/టెక్స్ట్  ఎయిర్ పాడ్ లలో అందుబాటులో ఉంది. ఆపిల్ ఎయిర్ పాడ్,  ఐప్యాడ్  లో ఆపిల్ పెన్సిల్  ఫీచర్ అందిస్తున్నట్టు ఆపిల్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.  
 

click me!