శాంసంగ్‌ గెలాక్సీ నోట్ 20పై భారీ డిస్కౌంట్.. ఏకంగా 15 వేల వరకు తగ్గింపు..

Ashok Kumar   | Asianet News
Published : Sep 17, 2020, 04:53 PM ISTUpdated : Sep 17, 2020, 10:27 PM IST
శాంసంగ్‌ గెలాక్సీ నోట్ 20పై భారీ డిస్కౌంట్.. ఏకంగా 15 వేల వరకు తగ్గింపు..

సారాంశం

ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయిన దాదాపు ఒక నెల తరువాత దీని ధరపై రూ.9,000 తగ్గించింది. ఒకవేళ మీరు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేస్తే మీరు అదనంగా 6,000 రూపాయల క్యాష్‌బ్యాక్‌ కూడా పొందవచ్చు. 

సౌత్‌కొరియా ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 20 ఫోన్ పై ఏకంగా 15 వేల డిస్కౌంట్ అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయిన దాదాపు ఒక నెల తరువాత దీని ధరపై రూ.9,000 తగ్గించింది.

ఒకవేళ మీరు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేస్తే మీరు అదనంగా 6,000 రూపాయల క్యాష్‌బ్యాక్‌ కూడా పొందవచ్చు. అంటే సామ్‌సంగ్ నోట్ 20 పై మొత్తంగా రూ.15 వేల డిస్కౌంట్‌ వస్తుంది.

డిస్కౌంట్ ధరతో మీకు ఈ ఫోన్ 62,999 రూపాయలకు లభ్యమవుతుంది. గెలాక్సీ నోట్ 20ను భారతదేశంలో ఆగస్టు 6న రూ .77,999 ధరతో లాంచ్ చేశారు.

ప్రస్తుతం సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 20 పై ఈ ఆఫర్  లీలిటెడ్ పీరియడ్ మాత్రమే అని “శామ్సంగ్ డేస్” సేల్స్ లో ఇది ఒక భాగం అని తెలిపింది. సెప్టెంబర్ 17 నుండి  సెప్టెంబర్ 23 వరకు అంటే ఒక వారం పాటు మాత్రమే ఈ తగ్గింపు ఆఫర్ ఉంటుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 20 ప్రారంభ ధర రూ .77,999. సామ్‌సంగ్ .కామ్, సామ్‌సంగ్ స్టోర్, ప్రముఖ ఆన్‌లైన్ పోర్టల్స్, రిటైల్ స్టోర్లలో ఈ డిస్కౌంట్ లభిస్తుంది.

గెలాక్సీ నోట్‌ 20 స్పెసిఫికేషన్లు:  6.70 అంగుళాల పెద్ద  డిస్‌ప్లే, కార్నింగ్ తాజా గొరిల్లా గ్లాస్, శాంసంగ్‌ ఎక్సీనోస్‌ 990 ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్‌, 4300mAh బ్యాటరీ కెపాసిటీ, ఆండ్రాయిడ్‌ 10 ఓఎస్‌. గెలాక్సీ నోట్ 20 వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది,

ఇందులో 12 ఎంపి మెయిన్ + 12 ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ + 64 ఎంపి టెలిఫోటో కెమెరా అందించారు. ముందు భాగంలో 10 ఎంపీ సెల్ఫీ కెమెరా అందించారు. గెలాక్సీ నోట్ 20 లోని బ్యాటరీ సామర్థ్యం 4,300 ఎంఏహెచ్.
 

PREV
click me!

Recommended Stories

Best Camera Phones : 2025లో టాప్ 5 కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే
Starlink : ఎలన్ మస్క్ స్టార్‌లింక్ భారత్‌లో స్టార్ట్ : ప్లాన్‌లు, స్పీడ్, సైన్‌అప్.. ఫుల్ డిటెయిల్స్ ఇవే