అమెజాన్ మెగా సాలరి డేస్ సేల్.. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, హెడ్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ పై కళ్ళు చెదిరే ఆఫర్లు..

Ashok Kumar   | Asianet News
Published : Dec 30, 2020, 06:09 PM ISTUpdated : Dec 30, 2020, 10:50 PM IST
అమెజాన్ మెగా సాలరి డేస్ సేల్.. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, హెడ్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ పై కళ్ళు చెదిరే ఆఫర్లు..

సారాంశం

ఈ సేల్ జనవరి 1న ప్రారంభమై 3 వరకు కొనసాగుతుంది. అమెజాన్ రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్, వాషింగ్ మెషీన్లు, టీవీలు, ఫర్నిచర్, స్పోర్ట్స్ ప్రొడక్ట్స్, గృహోపకరణాలు, బొమ్మలు, ఇంకా ఇతర వాటిపై బెస్ట్ ఆఫర్లు, డీల్స్ అందిస్తుంది.

అమెరికన్ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా 'మెగా సాలరి డేస్' సేల్ ప్రకటించింది. ఈ సేల్ జనవరి 1న ప్రారంభమై 3 వరకు కొనసాగుతుంది. అమెజాన్ రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్, వాషింగ్ మెషీన్లు, టీవీలు, ఫర్నిచర్, స్పోర్ట్స్ ప్రొడక్ట్స్, గృహోపకరణాలు, బొమ్మలు, ఇంకా ఇతర వాటిపై బెస్ట్ ఆఫర్లు, డీల్స్ అందిస్తుంది.

శామ్సంగ్, ఎల్‌జి, వర్పూల్, గోద్రేజ్, సోనీ, జెబిఎల్ తో పాటు ఇతర బ్రాండ్ల ఉత్పత్తులు తగ్గింపు ధరతో లిమిటెడ్ ఆఫర్లలో లభిస్తాయి. అంతేకాకుండా బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు లేదా  క్రెడిట్ కార్డ్ ఇఎంఐలపై వినియోగదారులకు 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

మెగా సాలరి డేస్ సేల్ లో ఉపకరణాలపై 200కు పైగా డీల్స్ ఉంటాయని 1 జనవరి శుక్రవారం 2021 నుండి ప్రారంభమై జనవరి 3 ఆదివారం వరకు కొనసాగుతుందని అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది.

also read ఆపిల్‌ హెడ్‌ఫోన్స్‌ ధర రూ.59,900 కానీ ఈ హెడ్‌ఫోన్స్‌ ధర రూ.80 లక్షలు ఎందుకంటే ? ...

అమెజాన్ మెగా సాలరి డేస్ సేల్ లో ఉన్న కొన్ని డీల్స్, ఆఫర్లు

బోట్, సోనీ, జెబీఎల్ వంటి బ్రాండ్ల హెడ్‌ఫోన్‌పై 50 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. బోస్, సోనీ, హర్మాన్ కార్డాన్ వంటి ప్రీమియం హెడ్‌ఫోన్‌లు, స్పీకర్లపై  9 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ అందిస్తుండగా బోట్, జెబిఎల్, షియోమి కంపెనీల సౌండ్ బార్‌లు 30 శాతం వరకు తగ్గింపుతో లభిస్తాయి.

ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌ల ధరలపై రూ.30వేల వరకు తగ్గింపు లభిస్తుంది. రూ.27,990 ప్రారంభ ధర గల డీఎస్‌ఎల్‌ఆర్‌లు, మీర్రర్‌లెస్, పాయింట్ షూట్ కెమెరాలను నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ తో కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్ వాచీలు, ఫిట్నెస్ ట్రాకర్ల ధరపై  40 శాతం ఆఫ్ తో అందిస్తుంది.

అమెజాన్ 'మెగా శాలరీ డేస్' సేల్ లో పెద్ద ఉపకరణాల పై 40 శాతం వరకు, ఉత్తమంగా అమ్ముడైన వాషింగ్ మెషీన్లపై  35 శాతం వరకు, ఎయిర్ కండీషనర్లపై 35 శాతం వరకు, మైక్రోవేవ్లపై 40 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది. వీటితో పాటు మరెన్నో ఇతర ఉత్పత్తుల పై ఆకర్షణీయమైన ఆఫర్లు లభిస్తాయి.

PREV
click me!

Recommended Stories

Viral News: ‘మీరు చ‌నిపోయారా’.? యువత పెద్ద ఎత్తున ఈ యాప్‌ను ఎందుకు డౌన్‌లోడ్ చేస్తోంది
Realme 16 Pro Series : రియల్‌మీ 16 ప్రో సిరీస్ వచ్చేసింది.. 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. ధర ఎంత?