ఆన్‌లైన్ గేమర్ల కోసం అతిపెద్ద ఆన్‌లైన్-గేమింగ్‌ టోర్నమెంట్ ప్రారంభం.. యూట్యూబ్‌ ద్వారా లైవ్..

By S Ashok KumarFirst Published Dec 30, 2020, 2:49 PM IST
Highlights

జియో, మీడియాటెక్ తో కలిసి భారతదేశంలో కొత్త, ఇప్పటికే ఉన్న ఆన్‌లైన్ గేమింగ్ ఔత్సాహికులను లక్ష్యంగా చేసుకొని ఈ‌స్పొర్ట్స్ ఈవెంట్ ‘గేమింగ్ మాస్టర్స్’ ప్రారంభించనుంది.

ముంబై, 29 డిసెంబర్ 2020: దేశీయ టెలికాం దిగ్గజం జియో, తైవాన్ చెందిన ఎలక్ట్రానిక్స్ కంపెనీ మీడియాటెక్ తో కలిసి భారతదేశంలో కొత్త, ఇప్పటికే ఉన్న ఆన్‌లైన్ గేమింగ్ ఔత్సాహికులను లక్ష్యంగా చేసుకొని ఈ‌స్పొర్ట్స్ ఈవెంట్ ‘గేమింగ్ మాస్టర్స్’ ప్రారంభించనుంది.

మొట్టమొదటి ఆన్‌లైన్ గేమింగ్ ఈవెంట్ - ‘ఇండియా కా గేమింగ్ ఛాంపియన్’ ను జియోగేమ్స్ విజయవంతంగా పూర్తయిన కొద్ది రోజులకే ఈ 70 రోజుల ఈస్పోర్ట్స్ టోర్నమెంట్ రాబోతుంది.

గేమింగ్ మాస్టర్స్ గురించి:  గేమింగ్ మాస్టర్స్ అనేది మీడియాటెక్, జియో చేత సాధారణ గేమర్లను కీలక గేమర్లుగా పరిగణించే సంస్థ, ఇది ఒక విప్లవాత్మకమైన ఆన్‌లైన్ గేమింగ్. 

వర్చువల్ గేమింగ్ రంగంలో గేమర్ల  స్కిల్స్, జట్టు కృషి, ఓర్పును పరీక్షించడానికి ఈ టోర్నమెంట్ సెట్ చేయబడింది, ఇందుకు రూ.12,50,000 బహుమతి కూడా ఇవ్వనుంది. మొత్తం టోర్నమెంట్ జియో టి‌వి హెచ్‌డి ఈస్పోర్ట్స్ ఛానల్ అలాగే యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

గేమింగ్ మాస్టర్స్ గారెనా స్వీయ-అభివృద్ధి చెందిన హిట్ బాటిల్ రాయల్ టైటిల్, ఫ్రీ ఫైర్ కలిగి ఉంటుంది. దీనిని జియో గేమ్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా జియో, నాన్-జియో వినియోగదారులకు అందుబాటులో ఉంచింది.

ముఖ్యమైన తేదీలు: రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ : 29 డిసెంబర్ 2020  నుండి  9 జనవరి 2021 వరకు 

టోర్నమెంట్ తేదీలు: 13 జనవరి 2021 నుండి  7 మార్చి 2021 వరకు 

రిజిస్ట్రేషన్ కోసం : https://play.jiogames.com/esports లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జియో లేదా నాన్ జియో వినియోగదారులకు ఈ రిజిస్ట్రేషన్లు ఓపెన్ గా ఉంటాయి.

దీనికి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదా పాల్గొంటున్నందుకు ఫీజు లేదు మరింత సమాచారం కోసం https://i.mediatek.com/free-fire-gaming-master-Jioesport లో చూడవచ్చు
 

click me!