జూక్ ప్రొఫెషనల్ గేమింగ్ హెడ్‌ఫోన్స్.. ఒకేసారి ఇండియాలో 10 మోడల్స్ లాంచ్..

By Sandra Ashok KumarFirst Published Nov 3, 2020, 7:22 PM IST
Highlights

జూక్ గేమింగ్ హెడ్‌ఫోన్‌ల ఫీచర్స్ గురించి చెప్పాలంటే ఆక్టివ్ నాయిస్ క్యాన్సల్,  ప్రొఫెషనల్ సరౌండ్ సౌండ్ క్వాలిటీతో వస్తుంది . ఈ హెడ్‌ఫోన్‌లతో మీరు నిజంగా రియల్ టైమ్ అనుభూతిని అనుభవిస్తారని కంపెనీ పేర్కొంది. ఈ హెడ్‌ఫోన్‌ల బరువు కేవలం ఒక పౌండ్ మాత్రమే.
 

ఫ్రెంచ్ కంపెనీ జూక్ భారతీయ మార్కెట్లోకి  10 కొత్త గేమింగ్ హెడ్‌ఫోన్‌లను విడుదల చేసింది. అవి స్టీల్త్, రాంబో, స్టాలోన్, బ్రావో, స్నిపర్, కమ్యూనికేషన్, కిల్లర్, కిల్లర్ గోల్డ్, గేమర్జెడ్ 1, రైఫిల్. ఈ హెడ్‌ఫోన్‌ల ధరలు రూ.2వేల  నుంచి రూ.5వేల మధ్య ఉంటాయి.

ఇవన్నీ ప్రొఫెషనల్ గేమింగ్ హెడ్‌ఫోన్‌లు. దీని ప్రీమియం డిజైన్, లాంచ్ లాస్ట్ బిల్డ్ క్వాలిటీతో వస్తున్నాయి.

జూక్ గేమింగ్ హెడ్‌ఫోన్‌ల ఫీచర్స్ గురించి చెప్పాలంటే ఆక్టివ్ నాయిస్ క్యాన్సల్,  ప్రొఫెషనల్ సరౌండ్ సౌండ్ క్వాలిటీతో వస్తుంది . ఈ హెడ్‌ఫోన్‌లతో మీరు నిజంగా రియల్ టైమ్ అనుభూతిని అనుభవిస్తారని కంపెనీ పేర్కొంది. ఈ హెడ్‌ఫోన్‌ల బరువు కేవలం ఒక పౌండ్ మాత్రమే.

also read చైనాకు పోటీగా భారతీయ మార్కెట్లోకి మైక్రోమాక్స్ 'ఇన్‌’ సిరీస్‌ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు..

ఎక్కువ మన్నిక, వినియోగదారులకు సౌకర్యంగా ఉండటానికి కోసం సంస్థ ఈ హెడ్‌ఫోన్‌లకు మృదువైన ఇయర్‌ప్యాడ్‌లను ఇచ్చింది. ఈ హెడ్‌ఫోన్‌లలో  7.1 సరౌండ్ సౌండ్ సిస్టమ్ లభిస్తుంది. ఈ  హెడ్‌ఫోన్‌లలో గన్ ఫైరింగ్ సౌండ్ స్పష్టంగా వినిపిస్తుంది.
 
ఈ హెడ్‌ఫోన్‌లు ప్రత్యేకంగా పిఎస్ 4 గేమర్స్ కోసం రూపొందించబడ్డాయి. ఈ హెడ్‌ఫోన్‌లు 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌తో వస్తాయి. మీరు విటిని ప్లేస్టేషన్ 4, ఎక్స్‌బాక్స్ వన్, కంప్యూటర్, నింటెండో 3డి‌ఎస్ మొదలైన వాటితో ఉపయోగించవచ్చు. హెడ్‌ఫోన్స్‌లో రెండు వైపులా ఎల్‌ఈడీ లైట్లు కూడా ఉన్నాయి.

అలాగే ఈ హెడ్‌ఫోన్‌లలో మైక్ కూడా ఉంది. వీటిలో రాంబో, బ్రావో, కిల్లర్, కిల్లర్ గోల్డ్ లో 50 ఎంఎం నియోడైనమిక్ డ్రైవర్స్ ఉండగా స్టీల్త్, స్టాలోన్, స్నిపర్, కమ్యూనికేషన్, రైఫిల్, గేమర్జెడ్ 1 లో 40 ఎంఎం నియోడైమియం డ్రైవర్‌తో వస్తాయి.
 

click me!