వాట్సాప్‌తో మీ ఫోన్ స్టోరేజ్ నిండిపోయిందా.. ? అయితే ఈ ట్రిక్ యూజ్ చేయండి..

By Sandra Ashok KumarFirst Published Nov 3, 2020, 12:38 PM IST
Highlights

ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న అత్యంత ప్రాచుర్యం పొందిన యాప్ వాట్సాప్. ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కొద్ది రోజుల క్రితం ప్రతిరోజూ 100 బిలియన్ మెసేజులు వాట్సాప్‌ ద్వారా పంపుతున్నారని తేలిపారు. 

మనలో చాలామంది ఫేస్‌బుక్, ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ ద్వారా  ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వడానికి ఉపయోగిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న అత్యంత ప్రాచుర్యం పొందిన యాప్ వాట్సాప్.

ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కొద్ది రోజుల క్రితం ప్రతిరోజూ 100 బిలియన్ మెసేజులు వాట్సాప్‌ ద్వారా పంపుతున్నారని, వీటిలో టెక్స్ట్ మెసేజులు మాత్రమే కాకుండా, ఫోటోలు, ఆడియో ఫైల్స్, వీడియోలు కూడా ఉన్నాయి అని తేలిపారు. అయితే ఈ మీడియా ఫైల్స్ మీ ఫోన్ స్టోరేజ్ ని వినియోగిస్తుంది.

మీరు అనేక వాట్సాప్ గ్రూప్ చాట్ లలో భాగమైతే, మీరు మీడియా ఆటో-డౌన్‌లోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే, మీ ఫోన్ స్టోరేజ్ త్వరగా నిండిపోతుంది. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీ ఫోన్ స్టోరేజ్ చాలా వేగంగా ఫుల్ అయిపోతుంది.

ఏ చాట్‌లు ఎక్కువ స్టోరేజ్ వినియోగిస్తున్నాయో తెలుసుకోవడానికి మీకు సహాయపడే ఒక ఫీచర్ ని వాట్సాప్ అందిస్తుంది. ఈ వాట్సాప్ ఫీచర్ ఎంతో దాని గురించి తెలుసుకుందాం…

also read 

వాట్సాప్ చాట్ లో ఏ చాట్ ఎక్కువ స్టోరేజ్ వినియోగిస్తుందో ఎలా చెక్ చేయాలంటే..

స్టెప్ 1: మొదట ఫోన్‌లో వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేసి, ఆపై స్క్రీన్ కుడి వైపున మీరు చూసే మూడు డాట్ ఐకాన్‌పై క్లిక్ చేయండి. తరువాత సెట్టింగ్‌లపై నొక్కండి.

స్టెప్ 2: దీని తరువాత మీరు డేటా అండ్ స్టోరేజ్ ఆప్షన్ నొక్కాలి, మీ ఫోన్‌లో ఏ చాట్‌లు ఎక్కువ స్టోరేజ్ వినియోగిస్తున్నాయో మీరు చూస్తారు.

స్టెప్  3: సెట్టింగుల స్టోరేజ్ యుసెజ్  ఆప్షన్ లో మీకు ఈ ఆప్షన్ కనిపిస్తుంది. మీరు దాన్ని నొక్కిన వెంటనే, మీకు అన్ని వాట్సాప్ చాట్‌ల గురించి సమాచారం వస్తుంది. మీరు తెలుసుకోవాలనుకునే ఏదైనా చాట్ పేరుపై క్లిక్ చేసిన తర్వాత, యాప్ మీకు ఎన్ని ఫోటోలు, మెసేజులు, జీఫీలు, స్టిక్కర్లు, ఆడియో మెసేజులు, వీడియోలు, డాక్యుమెంట్స్  వచ్చాయి లేదా మీరు పంపించిన వాటి గురించి పూర్తి సమాచారాన్ని ఇస్తుంది.

ఇది మాత్రమే కాదు, కింద మీకు ఫ్రీ అప్ స్పేస్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు మీడియాను డిలెట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు .  
 

click me!