రిలయన్స్‌ జియో మరో రికార్డు... మూడున్నరేళ్లకే ‘టాప్’ రేంజి లోకి ...

By Sandra Ashok KumarFirst Published Jan 17, 2020, 11:24 AM IST
Highlights

టెలికం రంగంలో అనూహ్య విజయాలు సాధించిన ఘనత ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియోదే. సంస్థ సేవలు ప్రారంభించిన మూడున్నరేళ్లలోనే దేశంలోనే అతిపెద్ద సంస్థగా అవతరించింది. ఇటు సబ్ స్క్రైబర్లు, అటు ఆదాయంలోనే 2019 నవంబర్ నెలలోనే అగ్రశ్రేణి సంస్థగా నిలిచింది జియో.

న్యూఢిల్లీ: టెలికం దిగ్గజ సంస్థ రిలయన్స్‌ జియో మరో ప్రభంజనం సృష్టించింది. టెలికం సేవలు ఆరంభించి మూడున్నరేళ్లలోనే దేశంలో అతిపెద్ద సంస్థగా అవతరించింది. గతేడాది నవంబర్‌ నాటికి 36.9 కోట్ల మంది మొబైల్‌ వినియోగదారులతో ఈ రికార్డును సాధించిందని టెలికం నియంత్రణ మండలి (ట్రాయ్‌) గురువారం తెలిపింది. 

జియో పోటీ సంస్థయైన వొడాఫోన్‌ ఐడియా 33.62 కోట్ల కస్టమర్లతో రెండో స్థానానికి పడిపోగా, భారతీ ఎయిర్‌టెల్‌ 32.72 కోట్లతో ఆ మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి. మొత్తంమీద గతేడాది నవంబర్‌ చివరినాటికి టెలిఫోన్‌ సబ్‌స్ర్కైబర్ల సంఖ్య 2.4 శాతం తగ్గి 117.58 కోట్లకు తగ్గారు. 

also read టెలికం ప్రొవైడర్లకు గట్టి ఎదురుదెబ్బ...1.47 లక్షల కోట్లు చెల్లించాల్సిందే...

అక్టోబర్‌ చివరినాటికి టెలికం సబ్ స్క్రైబర్ల సంఖ్య 120.48 కోట్లు. టెలికం వినియోగదారుల్లో అత్యధిక మంది మొబైల్‌ సబ్‌స్ర్కైబర్లు ఉండగా, వీరి సంఖ్య కూడా 2.43 శాతం తగ్గి 115.43 కోట్లకు పరిమితమయ్యారని ట్రాయ్ నివేదిక తెలిపింది. అంతక్రితం నెలలో 118.34 కోట్లుగా ఉన్నారు.

వొడాఫోన్‌ ఐడియా అత్యధిక మంది మొబైల్‌ వినియోగదారులను కోల్పోయినట్లు ట్రాయ్‌ తెలిపింది. వొడాఫోన్‌ ఐడియా ఏకంగా 3.6 కోట్ల మంది కస్టమర్లను కోల్పోయింది. కానీ, రిలయన్స్‌ జియో 56 లక్షల మంది నూతన కస్టమర్లను ఆకట్టుకోగా, భారతీ ఎయిర్‌టెల్‌ 16.59 లక్షలు, ప్రభుత్వరంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ 3.41 లక్షల మంది కస్టమర్లు ఎంచుకున్నారు. 

also read  ఆర్‌కామ్‌ ఆస్తుల రేసులో జియో.. ఎయిర్‌టెల్ కూడా

ఫిక్స్‌డ్‌ లైన్‌ కనెక్షన్లు కూడా 2.14 కోట్ల నుంచి 2.12 కోట్లకు తగ్గాయి. ఫిక్స్‌డ్ లైన్లను కోల్పోయిన సంస్థల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ అగ్రస్థానంలో ఉన్నది. 1.64 లక్షల ఫిక్స్‌డ్‌ లైన్‌ కనెక్షన్లు తగ్గడంతో కస్టమర్ల సంఖ్య కోట్ల నుంచి లక్షల్లోకి 98.30 లక్షల్లోకి పడిపోయింది. ఇదే సమయంలో రిలయన్స్‌ జియో కస్టమర్లు తొలిసారిగా 10.23 లక్షలకు చేరుకున్నది. 

ఇక 2.67 శాతం పెరిగిన బ్రాడ్‌బ్యాండ్‌ సబ్‌స్ర్కైబర్ల సంఖ్య 66.12 కోట్లకు చేరుకున్నారు. 98.99 శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉన్నాయి తొలి ఐదు సేవలు అందించే సంస్థలు. వీరిలో రిలయన్స్‌ జియోకు 37 కోట్ల సబ్‌స్ర్కైబర్లు ఉండగా, భారతీ ఎయిర్‌టెల్‌ 13.99 కోట్ల మంది, వొడాఫోన్‌ ఐడియాకు 11.98 కోట్లు, బీఎస్‌ఎన్‌ఎల్‌కు 2.25 కోట్లు ఉన్నారు.
 

click me!