తమిళనాడు: ప్రచారంలో గుండెపోటు.. అన్నాడీఎంకే ఎంపీ మృతి

Siva Kodati |  
Published : Mar 23, 2021, 09:28 PM ISTUpdated : Mar 23, 2021, 09:29 PM IST
తమిళనాడు: ప్రచారంలో గుండెపోటు.. అన్నాడీఎంకే ఎంపీ మృతి

సారాంశం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విషాదం చోటు చేసుకుంది. ప్రచారానికి సిద్ధమవుతుండగా అధికార పార్టీకి చెందిన ఎంపీ గుండెపోటుతో మరణించారు. 

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విషాదం చోటు చేసుకుంది. ప్రచారానికి సిద్ధమవుతుండగా అధికార పార్టీకి చెందిన ఎంపీ గుండెపోటుతో మరణించారు. వివరాల్లోకి వెళితే.. మహ్మద్‌ జాన్‌ (72) అన్నాడీఎంకే తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో రాణిపేటలోని మాస్క్యూ వీధిలో ఉంటున్న జాన్‌ మంగళవారం అన్నాడీఎంకే అభ్యర్ధుల తరపున ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. బయటకు వెళ్తుండగా ఆయనకు ఛాతీనొప్పి వచ్చింది.

దీంతో ఆయనను కుటుంబసభ్యులు, నేతలు ఆస్పత్రికి తరలించారు. మహ్మద్‌ జాన్‌ 2011లో రాణిపేట ఎమ్మెల్యేగా గెలిచి అప్పటి జయలలిత కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ఆయన మృతితో రాణిపేట ప్రజలు విషాదంలో మునిగింది. అప్పట్లో రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లుకు జాన్‌ మద్దతు ప్రకటించడం తీవ్ర వివాదాస్పదమైంది.

దీంతో రాణిపేట నియోజకవర్గంలో ఓ మతానికి చెందిన వారు ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు. ఆయన మృతికి డీఎంకే అధినేత స్టాలిన్‌ సహా పలువరు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.    
 

PREV
click me!

Recommended Stories

తమిళనాడు సీఎంగా స్టాలిన్: ఈ నెల 7న ప్రమాణం
వారసత్వం: జయలలిత కంచుకోటలో విజయం ఆయనదే..