భజ్జీ ఇంగ్లీష్ కష్టాలు.. వింటే నవ్వుఆపుకోలేరు

First Published Jun 1, 2018, 11:55 AM IST
Highlights

ఇంగ్లాండ్ లో భజ్జీ ఇంగ్లీష్ కష్టాలు

ఇండియన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతనిని అభిమానులు భజ్జీ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు.  భజ్జీ.. తన ఆఫ్ స్పిన్ బౌలింగ్ తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. తన దూస్రాలతో ప్రత్యర్ధి జట్లకు చెందిన ఎంతోమంది బ్యాట్స్‌మెన్లను అయోమయంలో పడేశాడు. అలాంటి హర్భజన్ సింగ్ తన తొలి ఇంగ్లాండ్ పర్యటనలో ఇంగ్లీష్ భాషతో ఇబ్బందికి గురయ్యాడంట. ఈ విషయాన్ని భజ్జీ 'వాట్ ద డక్' అనే వెబ్ సిరిస్ కార్యక్రమంలో స్వయంగా వెల్లడించాడు.

తన తొలి ఇంగ్లాండ్ పర్యటనలో మైదానంలో అద్భుత ప్రదర్శన చేశానని, అయితే ఇంగ్లీష్ లాంగ్వేజి వేసిన 'దూస్రా'కు మాత్రం ఔటయ్యానని చెప్పుకొచ్చాడు. హర్భజన్ సింగ్‌కు ఇంగ్లీష్ భాషపై పెద్దగా పట్టులేదు. మ్యాచ్ అనంతరం ఓ రిపోర్టర్ భజ్జీని మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారా? అని అడిగాడు.

అయితే ఇంగ్లీష్ భాష రాని భజ్జీకి ఆ మాట రిజర్వేషన్ చేయించుకున్నారా? అని అర్ధం అయింది. దీంతో భజ్జీ "అవును సర్, నేను రిజర్వేషన్ చేయించుకున్నాను. నేను రేపు వెళ్తున్నాను" అని సమాధానం ఇవ్వడంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు పూశాయి.

అయితే ఇంగ్లాండ్ పర్యటనలో ఇంగ్లీష్ భాష రాక ఇబ్బంది పడిన ఆటగాళ్లలో భజ్జీతో పాటు మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ కూడా ఉన్నాడు. మహమ్మద్ కైఫ్ కూడా ఇంగ్లీష్ భాష రాకపోవడంతో తాను కూడా ఓ సారి హోటల్లో ఇబ్బంది పడిన సంగతుల్ని గుర్తు చేసుకున్నాడు.


తన ఇంగ్లాండ్ తొలి పర్యటనలో హోటల్‌లో రిసెస్పనిస్ట్ నుంచి గది తాళాలు ఎలా అడిగి తీసుకోవాలో తెలియక చివరకు తన రూమ్‌మేట్‌తో గది తాళాలు తెప్పించినట్లు మహమ్మద్ కైఫ్ వెల్లడించాడు. 

click me!