ధోని మహిమ.. బాల్ స్టంప్స్ కి తగిలినా..

Published : Apr 01, 2019, 12:09 PM ISTUpdated : Apr 01, 2019, 12:17 PM IST
ధోని మహిమ.. బాల్ స్టంప్స్  కి తగిలినా..

సారాంశం

ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. గత రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ , రాజస్థాన్ రాయల్స్ తలపడ్డారు. ఈ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. 


ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. గత రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ , రాజస్థాన్ రాయల్స్ తలపడ్డారు. ఈ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. వెంట వెంటనే 4వికెట్లు కోల్పోయారు. దీంతో.. సీఎస్కే అభిమానులు నిరాశకు గురయ్యారు. కానీ ఆ తర్వాత జట్టు ఆడిన ఆట..  గెలిచేందుకు సహకరించింది.

అయితే.. ఈ మ్యాచ్ లో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ధోని ఫస్ట్ బాల్ కే ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే... జోఫ్రా ఆర్చర్ వేసిన 6వ ఓవర్ మూడో బంతి.. ధోనీ బ్యాట్‌కు ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకొని వికెట్లకు తగిలింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు సంబరాలు ప్రారంభించారు. 

కానీ బెయిల్స్ మాత్రం కిందపడకపోవడంతో అది నాటౌట్‌ అయింది. దీంతో ధోనీ నిలకడగా ఆడుతూ.. జట్టుకు భారీ స్కోర్ అందించేందుకు కృషి చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. మీరు కూడా ఓ లుక్కేయండి. 

 

PREV
click me!

Recommended Stories

Virat Kohli Marksheet : కోహ్లీకి టెన్త్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా? హయ్యెస్ట్, లోయెస్ట్ ఏ సబ్జెక్టుల్లో?
Rishabh Pant: ఓనర్ గొడవ, కెప్టెన్సీ అవుట్.. కట్ చేస్తే పాత గూటికి రిషబ్ పంత్.. ఎంత శాలరీ తగ్గిందో తెలుసా?