ఐపీఎల్ లో అడుగుపెట్టగానే.. రికార్డు సృష్టించిన బర్మన్

Published : Apr 01, 2019, 11:52 AM IST
ఐపీఎల్ లో అడుగుపెట్టగానే.. రికార్డు సృష్టించిన బర్మన్

సారాంశం

ఐపీఎల్ కి అడుగు పెట్టీ పెట్టగానే ఓ యువ క్రికెటర్ రికార్డు సృష్టించాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు తరుపున ప్రయాస్‌ రే బర్మన్‌ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అడుగుపెట్టాడు. 

ఐపీఎల్ కి అడుగు పెట్టీ పెట్టగానే ఓ యువ క్రికెటర్ రికార్డు సృష్టించాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు తరుపున ప్రయాస్‌ రే బర్మన్‌ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అడుగుపెట్టాడు. పలితంగా ఐపిఎల్‌లో అరంగేట్రం చేసిన అత్యంత పిన్నవయస్కునిగా  అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. 

ప్రయాస్‌ బర్మన్‌ 16ఏళ్ల 157 రోజుల వమసులో ఐపిఎల్‌లో అరంగేట్రం చేశాడు. దాంతో ఇప్పటివరకు ముజిబ్‌ ఉర్‌ రహ్మాన్‌ పేరిట ఉన్న రికార్డును ప్రయాస్‌ సవరించాడు. ముజిబ్‌ ఉర్‌ 17ఏళ్ల 11 రోజుల వయసులో ఐపిఎల్‌లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. 

ఈ జాబితాలో ప్రయాస్‌, ముజిబ్‌ ఉర్‌ తర్వాత స్థానాల్లో సర్పరాజ్‌ ఖాన్‌ (17ఏళ్ల 177 రోజులు), ప్రదీప్‌ సంగ్వాన్‌ (17ఏళ్ల 179 రోజులు), వాషింగ్టన్‌ సుందర్‌ (17ఏళ్ల 199 రోజులు)లు వరుసగా ఉన్నారు

PREV
click me!

Recommended Stories

Virat Kohli Marksheet : కోహ్లీకి టెన్త్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా? హయ్యెస్ట్, లోయెస్ట్ ఏ సబ్జెక్టుల్లో?
Rishabh Pant: ఓనర్ గొడవ, కెప్టెన్సీ అవుట్.. కట్ చేస్తే పాత గూటికి రిషబ్ పంత్.. ఎంత శాలరీ తగ్గిందో తెలుసా?